మంచిగ నిద్ర పట్టాలంటే ఏం చేయాలి?

మంచిగ నిద్ర పట్టాలంటే ఏం చేయాలి?

ఎంత మంచిగ నిద్రపోతే అంత ఫ్రెష్‌‌‌‌‌‌‌‌గా ఉంటం.  కొంతమందికి ఇట్ల మెత్త తగలంగనే అట్ల నిద్రపడతది. ఇంకొంతమంది ఎంత పోరాడినా నిద్రపట్టదు. ‘మాకు అస్సలు నిద్రపట్టదు’ అని అంటుంటరు. అయితే మంచిగ, హాయిగా నిద్రపోవాలంటే కొన్ని టిప్స్‌‌‌‌‌‌‌‌ ఫాలో అవ్వాలి. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే హాయిగా నిద్రపోవచ్చు. మరి అవేంటో ఓ లుక్కేద్దాం!

కాఫీ, కెఫైన్‌‌‌‌‌‌‌‌ ఉన్న డ్రింక్స్‌‌‌‌‌‌‌‌ సాయంత్రంపూట అవాయిడ్‌‌‌‌‌‌‌‌ చేయాలి. ముఖ్యంగా నిద్రపోయేముందు అస్సలు తీసుకోకూడదు.

 నిద్రపోవడం, మేల్కొనే టైమింగ్స్‌‌‌‌‌‌‌‌ విషయంలో కరెక్ట్‌‌‌‌‌‌‌‌గా ఉండాలి. ప్రతిరోజు వాటినే మెయింటైన్‌‌‌‌‌‌‌‌ చేయాలి. 

బెడ్‌‌‌‌‌‌‌‌టైమ్‌‌‌‌‌‌‌‌కి ముందు వేడి నీటితో స్నానం చేస్తే హాయిగా నిద్రపడుతుంది.

మనం పడుకునే బెడ్‌‌‌‌‌‌‌‌, దానిపై ఉన్న పిల్లో కంఫర్ట్‌‌‌‌‌‌‌‌బుల్‌‌‌‌‌‌‌‌గా ఉండాలి. మెడనొప్పి కలిగించే విధంగా, ఒళ్లు నొప్పులు వచ్చే విధంగా ఉండకుండా చూసుకోవాలి.

పడుకునేముందు సెల్‌‌‌‌‌‌‌‌ఫోన్‌‌‌‌‌‌‌‌ను వాడకపోవడం మంచిది.

మెడిటేషన్‌‌‌‌‌‌‌‌ చేస్తే చాలామంచిది. ప్రశాంతమైన మైండ్‌‌‌‌‌‌‌‌తో చక్కగా నిద్రపడుతుంది.

పడుకునే ముందు ఎక్సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైజ్‌‌‌‌‌‌‌‌ చేయడం మంచిది కాదు. సాయంత్రాలు చేస్తే బాగా నిద్రపడుతుంది.

నాన్‌‌‌‌‌‌‌‌ వర్కింగ్‌‌‌‌‌‌‌‌ డేస్‌‌‌‌‌‌‌‌లో, వీకెండ్స్‌‌‌‌‌‌‌‌లో అతిగా నిద్రపోకూడదు.

పడుకునే బెడ్‌‌‌‌‌‌‌‌పై చదువుకోవడం, ఆఫీస్‌‌‌‌‌‌‌‌ వర్క్‌‌‌‌‌‌‌‌ చేయడం, తినడం చేయకూడదు.