స్వైటెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు షాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రిక్వార్టర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే ఓడిన టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సీడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

స్వైటెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు షాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  ప్రిక్వార్టర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే ఓడిన టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సీడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

న్యూయార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: వరల్డ్ నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సీడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇగా స్వైటెక్​కు యూఎస్ ఓపెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చుక్కెదురైంది. డిఫెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా బరిలోకి దిగిన స్వైటెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ప్రిక్వార్టర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జెలెనా ఒస్తాపెంకో షాకిచ్చింది. ఆదివారం రాత్రి జరిగిన విమెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  సింగిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రిక్వార్టర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో స్వైటెక్ (పోలాండ్​)  6–3,  3–6, 1–6తో 20వ సీడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఒస్తాపెంకో (లాత్వియా) చేతిలో పరాజయం పాలైంది. ఈ విక్టరీతో జెలెనా 2017 ఫ్రెంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓపెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తర్వాత ఓ గ్రాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్లామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తొలిసారి క్వార్టర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేరింది. మరోవైపు అమెరికా టీనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, 19 ఏండ్ల కొకో గాఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 6–3, 3–6, 6–1తో వోజ్నియాకి (డెన్మార్క్​) విజయం సాధించింది. 15వ సీడ్​ మాడిసన్​ కీస్ (అమెరికా)​ 6–1, 6–3తో తోటి ప్లేయర్​ మూడో సీడ్​ జెస్సికా పెగులాను ఓడించింది. 9వ సీడ్​ వొండ్రుసోవా (చెక్​) కూడా క్వార్టర్స్​ చేరింది.

నొవాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ముందుకు

రికార్డు స్థాయిలో 24వ గ్రాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్లామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై కన్నేసిన సెర్బియా లెజెండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నొవాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జొకోవిచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  సింగిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో క్వార్టర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేరాడు. ప్రిక్వార్టర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రెండో నొవాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 6–2, 7–5, 6–4తో వరుస సెట్లలో బోర్నా గోజో (క్రొయేషియా) పై విజయం సాధించాడు. ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఐదు బ్రేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాయింట్లు సాధించిన జొకో ఒకేసారి సర్వీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోల్పోయాడు.  క్వార్టర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నొవాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తొమ్మిదో సీడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టేలర్ ఫ్రిట్జ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పోటీ పడనున్నాడు. మరో మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అమెరికన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫ్రిట్జ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 7–6 (7/2), 6–4, 6–4తో స్టీఫెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్ట్రైకర్ (స్విట్జర్లాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌)ను ఓడించాడు. అమెరికాకే చెందిన పదో సీడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫ్రాన్సెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తియపో 6–4, 6–1, 6–1తో రింకి హిజికటా (ఆస్ట్రేలియా)ను ఓడించి క్వార్టర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేరుకున్నాడు.