పొరుగు రాష్ట్రాల నుంచి గంజాయి, పొగాకు రవాణాను అడ్డుకోండి : తఫ్సీర్ ఇక్బాల్

పొరుగు రాష్ట్రాల నుంచి గంజాయి, పొగాకు రవాణాను అడ్డుకోండి : తఫ్సీర్ ఇక్బాల్

సంగారెడ్డి టౌన్, వెలుగు: పొరుగు రాష్ట్రాల నుంచి గంజాయి, పొగాకు, గుట్కా అక్రమ రవాణాను అడ్డుకోవాలని మల్టీ జోన్–2 ఇన్​చార్జి ఐజీపీ తఫ్సీర్​ ఇక్బాల్ ఆదేశించారు. బుధవారం సంగారెడ్డిలోని జిల్లా పోలీస్ కార్యాలయాన్ని సందర్శించారు. జిల్లా మీదుగా ఎలాంటి అక్రమ రవాణా జరగొద్దని, జిల్లాలో గంజాయి పండించినా, రవాణా చేసినా, మట్కా,పేకాడినా సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. 

రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ సజావుగా జరగడానికి కావాల్సిన చర్యలు తీసుకోవాలన్నారు. ఏఎస్పీ సంజీవరావు, డీటీసీ ఏఎస్పీ శ్రీనివాసరావు, డీఎస్పీలు సత్తయ్య గౌడ్, ప్రభాకర్, సైదా నాయక్, వెంకట్ రెడ్డి, సురేందర్ రెడ్డి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్​ కల్యాణి, ఏఆర్ డీఎస్పీ నరేందర్, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.