హైదరాబాద్, వెలుగు: ఐకేపీ నాలెడ్జ్ పార్క్ ఈ నెల 26, -28 తేదీల్లో హైదరాబాద్ జీనోమ్ వ్యాలీలో ఐకేఎంసీ– 2025 పేరుతో వార్షిక సదస్సు నిర్వహించనుంది. "ప్రపంచ సమస్యలకు సరికొత్త ఆవిష్కరణలు" అనే థీమ్‌తో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తోంది.
దేశాలు టెక్నాలజీల్లో బలంగా ఎదగడం, ప్రపంచ సహకారం గురించి ఇందులో చర్చిస్తారు. ముఖ్యంగా ఏఐ ఆధారిత ఇంక్యుబేటర్లు, భారీ పెట్టుబడులు వంటి భవిష్యత్ ఆవిష్కరణలపై దృష్టి పెడతారు. 150కి పైగా స్టార్టప్‌లు తమ కొత్త టెక్నాలజీలను 'టెక్ ఎక్స్' ప్రదర్శనలో చూపిస్తాయి. ఉత్తమ స్టార్టప్‌లో ఐకేపీ రూ.కోటి వరకు పెట్టుబడి పెడుతుంది.
యువ ఆవిష్కర్తలకు రూ.5 లక్షల గ్రాంట్లు కూడా ఇస్తారు. ఆవిష్కరణలను పెంపొందించడం, వాటిని దేశ సరిహద్దులు దాటి తీసుకెళ్లడం, ఇన్నోవేషన్లను అందరికీ అందుబాటులో ఉండేలా మార్చడమే సదస్సు లక్ష్యమని ఐకేపీ తెలిపింది.
