మరోసారి తన భక్తిని చాటుకున్న ఇళయరాజా... అమ్మవారికి రూ. 8 కోట్ల విలువైన కానుకలు విరాళం!

మరోసారి తన భక్తిని చాటుకున్న ఇళయరాజా...  అమ్మవారికి రూ. 8 కోట్ల విలువైన కానుకలు విరాళం!

ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా కర్ణాటకలోని మూకాంబిక అమ్మవారిని దర్శించుకున్నారు.  ఈ సందర్భంగా అమ్మవారికి రూ. 4 కోట్ల విలువైన వజ్రాల కిరీటాన్ని బహుకరించారు. అంతే కాకుండా  వీరభద్ర స్వామి వారికి రూ 4 కోట్ల విలువైన బంగారు కత్తిని విరాళంగా అందించి మరోసారి తన భక్తిని చాటుకున్నారు. ఈ విషయాన్ని ఆలయ అర్చకులు కె.ఎన్. సుబ్రమణ్య అడిగ తన సోషల్ మీడియాలో షేర్ చేశారు . ఈ ఫోటోలు ప్రస్తుతం ఇంటర్ నెట్ లో వైరల్ అవుతున్నాయి.

ఆలయంలో పూజా కార్యక్రమాలను పూర్తయిన అనంతరం ఇళయరాజాకు అర్చకులు తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వదించారు.  అమ్మవారి ఫోటోను అందజేశారు.  సంగీత దర్శకుడు ఇళయరాజా వెంట ఆయన కుమారుడు కార్తిక్, మనవడు యతీశ్,  బంధువులు ఉన్నారు. జగన్మాత మూకాంబిక అమ్మవారి ఆశీస్సుల వల్ల తాము ఈ స్థాయిలో ఉన్నామని ఇళయరాజా అన్నారు . అమ్మవారిని దర్శించుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుందని తెలిపారు. 

 

కర్ణాటకలోని మంగుళూరుకు 130 కిలో మీటర్లు దూరంలో ఉన్న మూకాంబికా దేవి ఆలయాన్ని సాధారణ భక్తుడిగానే ఇళయరాజా దర్శించుకుంటారు.  2006 కూడా అమ్మవారికి ఒక కిరీటాన్ని బహుకరించారని ఆలయ అధికారులు తెలిపారు. ఈ అమ్మవారి ఆలయాన్ని ఎక్కువగా కేరళ భక్తులు దర్శించుకుంటారు.