Ileana Baby Bump: మళ్ళీ తల్లి కాబోతున్న ఇలియానా.. బేబీ బంప్ ఫొటో షేర్!

Ileana Baby Bump: మళ్ళీ తల్లి కాబోతున్న ఇలియానా.. బేబీ బంప్ ఫొటో షేర్!

గోవా బ్యూటీ, టాలీవుడ్ ఇలియానా తన రెండవ బిడ్డను స్వాగతించడానికి సిద్ధంగా ఉంది. లేటెస్ట్గా (MAY28) ఇలియానా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో కొన్ని ఫోటోలు షేర్ చేసింది. ఇందులో తన గర్భిణీ స్నేహితురాలితో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చింది. "బంప్ బడ్డీస్" అనే క్యాప్షన్ ఇస్తూ తన బెస్ట్ మూమెంట్స్ షేర్ చేసుకుంది.

ఈ ఫొటోలో ఒకరినొకరు చూసుకుంటూ, చేతులను నడుములపై ఉంచుకుని వారు తీసుకున్న ఫోజు ఎంతో ముచ్చటగా ఉంది. గర్వంగా తమ బేబీ బంప్‌లను ప్రదర్శిస్తూ ఇద్దరు తల్లుల మధ్య ప్రత్యేక బంధాన్ని చూపించడంతో నెటిజన్ల మనసును దోచేసింది. ఇపుడీ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇకపోతే, ఇలియానా 2025 జనవరిలోనే రెండో సారి తల్లి కాబోతున్నట్లు హింట్ ఇచ్చింది. న్యూ ఇయర్ విషెష్ తెలిపే వీడియోను షేర్ చేసినప్పుడు తాను మళ్ళీ ప్రెగ్నెన్సీ అయినట్టు చెప్పకనే చెప్పింది. ఇక ఆ తర్వాత ఫిబ్రవరిలో, ఆమె ఒక సరదా పోస్ట్‌తో తన రెండవ సారి ప్రెగ్నెంట్ అయినట్లు  ధృవీకరించింది. “ఒకవేళ గర్భవతినైతే ఇలానే ఉంటుందేమో”అన్న విధంగా క్యాప్షన్ ఇచ్చి తాను మళ్లీ తల్లితనాన్ని ఆనందంగా స్వీకరిస్తున్నట్టు వెల్లడించింది. 

ఇకపోతే,  ఇలియానా 2023లో మైకేల్ డోలన్తో ప్రైవేట్ వేడుకలో వివాహం చేసుకుంది. 2023 ఆగస్టు 1న తాను పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ బుడ్డోడి పేరు ‘కోవా ఫీనిక్స్ డోలన్‌’.ఇప్పుడు రెండవసారి కూడా అదే భావోద్వేగాన్ని పొందుతున్నట్లు వరుస పోస్టులతో ఇలియానా వార్తల్లో నిలుస్తుంది. 

ఇక ఇలియానా సినిమాల విషయానికి వస్తే.. చివరగా తెలుగులో అమర్ అక్బర్ ఆంటోని సినిమాలో నటించింది. 2024లో "డో ఔర్ డో ప్యార్" అనే హిందీ మూవీలో నటించింది. షీర్షా గుహా ఠాకుర్తా తెరకెక్కించిన  రొమాంటిక్ కామెడీ మూవీలో విద్యా బాలన్, ప్రతీక్ గాంధీ కీలక పాత్రల్లో కనిపించారు.

ఆ తర్వాత సోషల్ మీడియాలో వరుస పోస్టులతోనే తెలుగు ప్రేక్షకులకు కనిపిస్తుంది. ప్రస్తుతం తన సినిమా కెరీర్ కంటే ఫ్యామిలీకే ఎక్కవ ప్రాధాన్యత ఇస్తూ ఎంజాయ్ చేస్తోంది. 

దేవదాస్‌ సినిమాతో టాలీవుడ్ లోకి  అడుగుపెట్టిన ఇలియానా.. పోకిరి, ఖతర్నాక్, రాఖీ, మున్నా, భలేదొంగలు, ఆట, కిక్, రెచ్చిపో, సలీమ్, శక్తి, నేను నా  రాక్షసి, జులాయి, దేవుడు చేసిన మనుషులు వంటి అనేక చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది.