బీఆర్ఎస్ ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యే.. దూమారం రేపుతున్న వర్గపోరు

బీఆర్ఎస్ ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యే.. దూమారం రేపుతున్న వర్గపోరు

మహబూబాబాద్ జిల్లాలో తాజా ఎమ్మెల్యే ..మాజీ ఎమ్మెల్యే అనుచరులు తన్నుకున్నారు. బయ్యారంలో ఎమ్మెల్యే హరిప్రియ నాయక్, మాజీ ఎమ్మెల్యే కోరం కనకయ్య వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. ఎమ్మెల్యే హరిప్రియ వర్గీయులు మాజీ ఎమ్మెల్యే కోరం కనకయ్య అనుచరుడు కోడి అరుణ్ పై కర్రలతో దాడి చేశారు. దీంతో అరుణ్ కు చెవి, ముక్కు, మెడ దగ్గర  గాయాలయ్యాయి.

దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన తాను... కోరం కనకయ్యతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నందుకు తనపై దాడి చేశారని బాధితుడు కోడి అరుణ్ ఆవేదన వ్యక్తం చేశాడు. బీఆర్ఎస్ నాయకులతో తనకు ప్రాణభయం ఉందని పోలీసులకు తెలిపాడు. ఆ తర్వాత కోడి అరుణ్ ను చికిత్స నిమిత్తం మహబూబాబాద్ ఆసుత్రికి తరలించారు.