జనగామ జిల్లాలో లైసెన్స్ లేకుండా అక్రమంగా నిల్వ చేసిన మెడిసిన్ స్వాధీనం

జనగామ జిల్లాలో లైసెన్స్ లేకుండా అక్రమంగా నిల్వ చేసిన మెడిసిన్ స్వాధీనం

జనగామ, వెలుగు: జనగామ జిల్లాలో లైసెన్స్​ లేకుండా అక్రమంగా నిల్వ చేసిన మెడిసిన్‌‌‌‌ స్వాధీనం చేసుకోవడంతోపాటు అర్హత లేకుండా ట్రీట్​మెంట్​ చేస్తున్న డాక్టర్‌‌‌‌‌‌‌‌పై క్రిమినల్​ కేసు నమోదు చేశారు. జనగామ మండలం ఎర్రగొల్లపహాడ్​లో పన్నీరు రమేశ్‌‌‌‌కు ఎలాంటి అర్హతలు లేకపోయినా ఫస్ట్ ఎయిడ్ క్లినిక్‌‌‌‌, లైసెన్స్ లేకుండా మెడికల్​ షాప్​ నిర్వహిస్తున్నాడు. 

సమాచారం అందుకున్న జిల్లా డ్రగ్​ఇన్‌‌‌‌స్పెక్టర్‌‌‌‌‌‌‌‌ బాలకృష్ణ, భూపాలపల్లి జిల్లా డ్రగ్​ఇన్​స్పెక్టర్​ పావని దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో రూ. 2.10 లక్షల విలువైన యాంటీ బయాటిక్స్, స్టెరాయిడ్స్, బీపీ, యాంటీ అల్సర్ మందులు, దగ్గు సిరప్‌‌‌‌లు, నొప్పి నివారణ వంటి 40 రకాల టాబ్లెట్లు, సిరప్‌‌‌‌లను సీజ్‌‌‌‌ చేశారు. రమేశ్‌‌‌‌పై క్రిమినల్​ కేసు నమోదు చేశారు.