ఎల్లారెడ్డిపేట, వెలుగు: ఇసుక అక్రమంగా తరలిస్తున్న లారీని సీజ్ చేసినట్లు ఎస్ఐ రాహుల్ రెడ్డి తెలిపారు. యూపీ రాష్ట్రం బిల్లాల్ జిల్లాకు చెందిన రాహుల్ కుమార్‌యాదవ్ అనుమతి లేకుండా లారీలో ఇసుక తరలిస్తుండగా ఎల్లారెడ్డిపేట మండలకేంద్రంలో పోలీసులు పట్టుకొని సీజ్ చేసి డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. నిందితుడిని జిల్లా మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా 14 రోజుల పాటు రిమాండ్ విధించినట్లు ఎస్ఐ తెలిపారు. అదేవిధంగా పదిర గ్రామం నుంచి ఇసుక తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను తహసీల్దార్ పట్టుకొని ఫైన్ వేశారు.
రెండు ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
రాయికల్, వెలుగు: రాయికల్ మండలం ఇటిక్యాల పెద్దవాగు నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను శుక్రవారం పట్టుకున్నట్లు తహసీల్దార్ నాగార్జున తెలిపారు. విశ్వసనీయ సమాచారంతో తమ సిబ్బందితో నిఘా వేసి పట్టుకున్నట్లు తహసీల్దార్ తెలిపారు. రూల్స్‌కు విరుద్ధంగా ఇసుక తోలితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
