బాబా రాందేవ్ పై చర్యలు తీసుకోవాలన్న ఐఎంఏ

V6 Velugu Posted on May 22, 2021

ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్ పై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) ఆగ్రహం వ్యక్తం చేసింది. అల్లోపతి వైద్యం, డాక్టర్లను అవమానించేలా మాట్లాడారన్నారు. అంతేకాదు కరోనా చికిత్సకు పనికిరాదని రాందేవ్ చెబుతున్నారంది IMA.  కరోనా కాలంలో ఎన్నో ఇబ్బందులు పడుతూ డాక్టర్లు శ్రమిస్తుంటే ఇలాంటి ఆరోపణలు చేయడం సరైంది కాదని తెలిపింది.

బాబా రాందేవ్ పై అంటువ్యాధుల చట్టం కింద చర్యలు తీసుకోవాలని IMA డిమాండ్ చేసింది. రాందేవ్ పై చర్యలు తీసుకోకపోతే అల్లోపతి వైద్య విధానాన్నయినా రద్దు చేయాలని కేంద్రానికి తేల్చి చెప్పింది. రాందేవ్ పై చర్యలు తీసుకోకుంటే ఆందోళన చేపడతామని IMA హెచ్చరించింది.

Tagged IMA demands, prosecution, Ramdev, unscientific statements, allopathy

Latest Videos

Subscribe Now

More News