రాబోయే 3, 4 రోజుల పాటు భారీ వర్షాలు, పిడుగులు పడే ఛాన్స్

రాబోయే 3, 4 రోజుల పాటు భారీ వర్షాలు, పిడుగులు పడే ఛాన్స్

భారత వాతావరణ శాఖ (IMD) హర్యానా, ఈశాన్య రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌లకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 3-4 రోజుల పాటు ఢిల్లీలో పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపింది. అరేబియా సముద్రం వల్ల వచ్చే తేమ కారణంగా వాయువ్య భారతదేశంలో మే 28, 29న ఇదే వాతావరణం ఉంటుందని, మరో 5 రోజుల పాటు వాయువ్య భారతదేశంలో పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

మే 28న ఈశాన్య యూపీలో భారీ వర్షాలు, ఇతర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. హర్యానా, ఈశాన్య రాజస్థాన్, యూపీకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసామని, మే 28న ఈశాన్య యూపీలో భారీ వర్షాలు, ఇతర ప్రాంతాలలో ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని  IMD శాస్త్రవేత్త డాక్టర్ సోమ సేన్ రాయ్ తెలిపారు తెలిపారు.

ఢిల్లీలో వర్షాలు

అంతకుముందు ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. వాతావరణంలో ఆకస్మిక మార్పు ఉత్తర భారతదేశంలో ఉన్న వేడి వాతావరణ పరిస్థితుల నుంచి ఉపశమనం కలిగిస్తోంది. మే 27న కూడా ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాల్లో వర్షాలు, ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.

https://twitter.com/AHindinews/status/1662269934712537089