జులై 8న రాష్ట్రంలో అతిభారీ వర్షాలు .. పది జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్

జులై 8న రాష్ట్రంలో అతిభారీ వర్షాలు .. పది జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మంగళవారం అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు పది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిమాజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని చెప్పింది. 

కాగా, సోమవారం నుంచి గురువారం వరకు మిగతా అన్ని జిల్లాలకూ వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్‌‌‌‌‌‌ను జారీ చేసింది. హైదరాబాద్‌‌‌‌లో ఉరుములతో కూడిన వర్షాలు పడే చాన్స్‌‌‌‌ ఉందని ఐఎండీ తెలిపింది.