పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD హెచ్చరించింది. పలు ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. వరదల పరిస్థితి భయంకరంగా ఉందని తెలిపింది. ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయనే సంగతి తెలిసిందే. దీంతో వాతావారణ శాఖ రెడ్, ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తోంది. ఇప్పటి వరకు 10 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలించారు. NDRF, రాష్ట్ర విపత్తు, ఇతర బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. ఉత్తరాఖండ్ లోని ఏడు జిల్లాల్లో ఈరోజు, రేపు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. డెహ్రడూన్, టెహ్రీ, పౌరి, నైనిటాల్, చంపావత్, ఉధమ్ సింగ్ నగర్, హరిద్వార్ లలో రాబోయే కొద్ది రోజుల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. హిమాచల్ ప్రదేశ్ లోని కిన్నౌర్ జిల్లాలో సోమవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి భారత్ - టిబెట్ సరిహద్దుల్లో ఉన్న కొన్ని గ్రామాలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు ఇంకా నీటిలోనే చిక్కుకున్నాయి. వేలాది మంది నిరాశ్రులయ్యారు. రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు మరణించిన వారి సంఖ్య 100కు చేరుకుంది. 

గుజరాత్ కూడా భారీ వర్షాలకు అతలాకుతలమైంది. Ukai డ్యామ్ నుంచి దాదాపు 60 వేల క్యూసెక్కుల నీటిని Tapi రివర్ కు విడుదల చేశారు. పూర్ణా నదిలో నీటి మట్టం పెరగడంతో నవ్ సారి జిల్లా జలదిగ్భందంలో చిక్కుకుంది. కుండపోతగా కురిసిన వర్షాలకు వల్సాద్ లో వరదలు పోటెత్తాయి. రాజస్థాన్ లోని బన్సవారా, చిత్తోర్ ఘర్, బుండి, ఝులావర్, సిరోహి, కోటా, రాజ్ సమంద్ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. రాష్ట్రంలోని పశ్చిమ ప్రాంతంలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో కోటా, ఉదయ్ పూర్, అజ్మీర్ డివిజన్ లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.