ఢిల్లీ వాసులకు ఉపశమనం.. పలు ప్రాంతాల్లో భారీ వర్షం

ఢిల్లీ వాసులకు ఉపశమనం.. పలు ప్రాంతాల్లో భారీ వర్షం

దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షం కురిసింది. 2024, జూన్ 27వ తేదీ గురువారం ఉదయం నుంచి నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. దీంతో గతకొన్ని రోజులుగా హై టెంపరేచర్ తో అల్లాడుతున్న ఢిల్లీవాసులకు ఉపశమనం లభించింది. 

ఆర్కేపురం, సరితా విహార్, మునిర్కా, ఇండియా గేట్ ప్రాంతాలు తడిసి ముద్దయ్యాయి. భారీ వర్షానికి రోడ్లపై వాన నీరు ప్రవహించింది.  ఉదయం పూట వర్షం పడడంతో ఆఫీసులు, స్కూళ్లకు వెళ్లే వారు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఇవాళ, రేపు ఢిల్లీతో పాటు ఘజియాబాద్, నోయిడా, గురుగ్రాంలలో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. ఈ నెల 30వ తేదీ ఆదివారం చాలా ప్రాంతాల్లో ఈదురుగాలులతో  పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది.