ఉక్రెయిన్​కు ఐఎంఎఫ్​ లోన్.. రూ.1.28 లక్షల కోట్లు 

ఉక్రెయిన్​కు ఐఎంఎఫ్​ లోన్.. రూ.1.28 లక్షల కోట్లు 
  •     రష్యా దాడితో అతలాకుతలమైన ఆర్థిక వ్యవస్థకు ఊరట 

ఫ్రాంక్ ఫర్ట్​ : రష్యా దండయాత్రతో అతలాకుతలమైన ఉక్రెయిన్​కు రూ.1.28 లక్షల కోట్ల (15.6  బిలియన్​డాలర్లు)  రుణం ఇచ్చేందుకు  ఇంటర్నేషన్​ మానిటరీ ఫండ్​(ఐఎంఎఫ్)  పచ్చజెండా ఊపింది. దీనిపై ఇరుపక్షాలు ఓ అగ్రిమెంట్​ను కుదుర్చుకున్నాయి. ఈ లోన్ ద్వారా సమకూరే నిధులను ఉక్రెయిన్​ ప్రభుత్వ అవసరాలను తీర్చడానికి వినియోగించనున్నారు. ఈ రుణాన్ని​నాలుగేళ్లలో విడతల వారీగా ఉక్రెయిన్​కు ఐఎంఎఫ్ అందిస్తుంది. లోన్​ మంజూరయ్యాక.. మొదటి 12 నుంచి 18 నెలల్లోగా దేశ బడ్జెట్​లోటును పూడ్చుకోవడంపై ఉక్రెయిన్​ ఫోకస్​ చేస్తుంది. ‘‘సెంట్రల్​ బ్యాంక్​ ద్వారా కరెన్సీని ముద్రించుకొని దేశ ఆర్థిక అవసరాలను తీర్చుకోవడం మొదలుపెడితే ఉక్రెయిన్​ కరెన్సీ విలువ పతనమయ్యే ముప్పు ఉంటుంది.

ఇలా జరగకుండా.. మేం అందించే లోన్​ హెల్ప్​ చేస్తుంది”అని ఐఎంఎఫ్​ ఒక ప్రకటనలో తెలిపింది. జీ7 దేశాలు, యూరోపియన్​ యూనియన్​ దేశాల నుంచి రానున్న రోజుల్లో ఉక్రెయిన్​కు​ ఆర్థిక సహాయక ప్యాకేజీలు అందుతాయనే సానుకూల దృక్పథంతో ఈ లోన్​ను మం జూరు చేసినట్లు ఐఎంఎఫ్ వెల్లడించింది. రష్యాను ఎదుర్కొనేందుకు గతేడాది సైనిక వ్యయాలను ఉక్రెయిన్​ భారీగా 
పెంచింది. దీంతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ ఒక్కసారిగా దాదాపు 30 శాతం పడిపోయింది. సంక్షోభ పరి స్థితుల కారణంగా ఉక్రెయిన్​ఖజానాకు పన్నుల రూపంలో ప్రజల నుంచి సమకూరే ఆదాయాలు కూడా డౌన్​ అయ్యాయి.