Bigg Boss 7: బిగ్ బాస్లో పహిల్వాన్స్.. ఐదువారాల ఇమ్యూనిటీ.. అదిరిపోయే ట్విస్ట్

Bigg Boss 7: బిగ్ బాస్లో పహిల్వాన్స్.. ఐదువారాల ఇమ్యూనిటీ.. అదిరిపోయే ట్విస్ట్

బిగ్ బాస్ సీజన్ 7(Bigg boss season 7) సరికొత్తగా మొదలైంది. ఈసారి అంత ఉల్టా పుల్టా అంటూ ముందునుండే చెప్పుకొచ్చారు. అందుకు తగ్గట్టుగానే షోను డిజైన్ చేశారు మేకర్స్. ఇందులో భాగంగానే ఇప్పటికి హౌస్ లోకి కేవలం 15 మంది మాత్రమే ఎంట్రీ ఇచ్చారు. వారు కూడా కన్ఫర్మ్ కాదని హోస్ట్ నాగార్జున మొదటిరోజే చెప్పేశారు. ముందు ముందు జరిగే గేమ్స్ తో, టాస్కులతో హౌస్ మేట్స్ తమ స్థానాన్ని సుస్థిరం చేసుకోనున్నారు.

ఇందులో భాగంగానే కంటెస్టెంట్స్ కు ఐదువారాల ఇమ్యూనిటీ గెలుచుకోవడానికి మొదటి టాస్క్ ను ఇచ్చారు. అదే పహిల్వాన్ టాస్క్. తాజాగా రిలీజైన ప్రోమో దీనికి సంబంధించిన టాస్క్ ను చూపించారు. ఈ టాస్క్ లో భాగంగా ఇద్దరు నిజమైన, కండలు తిరిగిన పహిల్వాన్స్ ఇంట్లోకి వచ్చారు. వాళ్ళని చూడాగానే ఒక్కసారిగా అవాక్కయ్యారు కంటెస్టెంట్స్. ఈ టాస్క్ లో భాగంగా ఒక్కో కంటెస్టెంట్ ఆ పహిల్వాన్ ను ఓడించాల్సి ఉంటుంది. టాస్క్ లో గెలిచిన వారికీ ఐదువారాల ఇమ్యూనిటీ లభించనుంది. 

Also Read : అడ్వాన్స్ బుకింగ్స్లో జవాన్ జోరు.. రికార్డ్స్ అన్నీ బ్రేక్!

ఇక టాస్క్ కు సిద్దమైన కంటెస్టెంట్స్ ఆ పహిల్వాన్ లతో సమరానికి సిద్ధమయ్యారు. ఒక్కొక్కరుగా వారితో పోటీపడ్డారు. అందులో ఎవరు గెలిచారన్నది చూపించలేదు కానీ.. ఇప్పటివరకు మీరు చేసింది కేవలం ప్రాక్టీస్ మాత్రమే.. అసలు ఆట ముందుంది అంటూ చివర్లో అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. ఆ షాక్ కి ఇంటి సభ్యులంతా ఒక్కసారిగా నోరెళ్లబెట్టారు. మరి ఈ గేమ్ నిజంగా ఉంటుందా?లేదా కంటెస్టెంట్స్ మధ్యే ఈ పోటీ జరగనుందా అనేది తెలియాలంటే ఇవాళ్టి ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యేవరకు ఆగాల్సిందే.