కొబ్బరి బోండాల్లో IED బాంబులు దాచిన ఉగ్రవాదులు

కొబ్బరి బోండాల్లో  IED బాంబులు  దాచిన ఉగ్రవాదులు

మణిపూర్ రాజధాని ఇంఫాల్ లో  IED బాంబులను పట్టుకున్నారు పోలీసులు. పీపుల్స్ రివల్యూషనరీ పార్టీ సభ్యుడిని అరెస్ట్ చేశారు. ఆర్మీపై దాడి చేసేందుకు IED బాంబులను సమకూర్చుకున్నట్టు ఇంఫాల్ పోలీసులు తెలిపారు. కొబ్బరి బోండాల్లో IEDలను దాచి తీసుకెళ్తుండగా... పోలీస్, ఆర్మీ జాయింట్ టీమ్ పట్టుకుంది. బాంబులను ఫిక్స్ చేసేందుకు మంత్రి పుఖ్రీలో రెక్కీ కూడా చేశారని పోలీసులు వివరించారు.