
ఎన్డీఏ ప్రభుత్వ పాలసీల్లో ఒకటైన మేక్ ఇన్ ఇండియా పై రాహుల్ గాంధీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మేక్ ఇన్ ఇండియా అంటే చైనా నుంచి స్పేర్ పార్ట్స్ తెచ్చి ఇండియాలో అసెంబుల్ చేయటమేనా.. ప్రధాని మోదీ చెప్పే మేక్ ఇన్ ఇండియాల అంటే ఇదేనా..? అని ప్రశ్నించారు. ఇండియాలో అసెంబ్లింగ్ మాత్రమే జరుగుతోందని.. తయారీ అనేది ఎక్కడుందని అన్నారు.
మేక్ ఇన్ ఇండియాపై ఎక్స్ రాహుల్ గాంధీ చేసిన పోస్ట్ చర్చనీయాంశంగా మారింది. చైనా నుంచి విడిభాగాలు తెచ్చి.. మేక్ ఇన్ ఇండియా పేరుమీద ఇక్కడ అసెంబుల్ చేస్తున్నారని అన్నారు రాహుల్ ఇండియాలో తయారయ్యే 80 శాతం టీవీలు.. ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ అలా తయారవుతున్నవేనని అన్నారు. iPhone నుంచి టీవీల వరకు పార్ట్స్ అన్నీ విదేశాల నుంచే వస్తున్నాయని.. మనం కేవలం అన్నింటిని జోడిస్తున్నామని అన్నారు.
చిన్న తరహా పరిశ్రమలకు అవకాశమేది..?
ఇండియాలో చిన్న తరహా పరిశ్రమలు తయారీకి ఆసక్తి చూపిస్తున్నా ఆ అవకాశం లేదని రాహుల్ అన్నారు. ఇండియాలో చిన్న వ్యాపారులకు, ఆంత్రప్రెన్యూవర్లకు ప్రోత్సాహం లేదని అన్నారు. తయారీ రంగానికి ఊతమిచ్చేలా చిన్నతరహా పరిశ్రమల వృద్ధికి ఒక పాలసీ అనేదే లేదని విమర్శించారు.
అత్యధిక ట్యాక్స్ లతో చిన్న, కుటీర పరిశ్రమలు మూత పడేలా చేశారని అన్నారు రాహుల్. తద్వారా మోనోపొలీ సిస్టం తీసుకొచ్చారని ఆరోపించారు. పెద్ద పెద్ద బడా కార్పోరేట్ వ్యాపారుల చేతుల్లోనే అన్ని ఉండేలా.. సూక్ష తరహా పరిశ్రమలను మూతపడేలా చేశారని విమర్శించారు.
మేక్ ఇన్ ఇండియా అంటే గ్రౌండ్ లెవల్ చేంజెస్ రావాలని అన్నారు రాహుల్. స్పేర్ పార్ట్స్ తెచ్చి అసెంబ్లీ చేసుకోవడంపై ఆధారపడటం మానేస్తే మార్పు వస్తుందని అభిప్రాయపడ్డారు. ఇండియాలో చిన్న తరహా పరిశ్రమలు, కొత్తగా పరిశ్రమలు పెట్టే ఆంత్రప్రెన్యూవర్ లను ప్రోత్సహిస్తే.. చైనాతో పోటీ పడొచ్చునని అన్నారు.
ఇండియా జీడీపీ లో తయారీ రంగం 2014లో 15.3 శాతం ఉండగా ఇప్పుడు అది 12.6 శాతానికి చేరుకుందని.. గత 60 ఏళ్లలో ఇదే కనిష్టస్థాయి అని అన్నారు. మేక్ ఇన్ ఇండియా అని చెప్పుకునే మోదీ ప్రభుత్వం.. తయారీ రంగాన్ని దారుణంగా పడవేశారని విమర్శించారు.
చైనా గత పదేళ్లుగా బ్యాటరీ, రోబో, మోటర్స్, ఆప్టిక్స్ లాంటి కొత్త టెక్నాలజీపై పనిచేస్తోందని... అందుకే ఇండియాతో పోల్చితో పదేళ్లు ముందుందని అన్నారు. చైనాతో పోటీ పడాలంటే ఉత్పత్తి సామర్థ్యం పెంచాలని.. కార్పోరేట్ల చేతుల్లోనించి చిన్న తరహా పరిశ్రమలు ఎదిగేలా పాలసీ తీసుకురావాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అలా చేస్తే ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయని అన్నారు.
జాబ్స్ తయారీ, ఉత్పత్తి నుంచి వస్తాయి.. ఆ విషయంలో మేక్ ఇన్ ఇండియా ఫెయిల్ అయ్యింది. ఎనర్జీ, మొబిలిటీ రంగం ద్వారా మార్పు తీసుకురావచ్చు.. అంటే రెనువబుల్ ఎనర్జీ, బ్యాటరీ, ఎలక్ట్రిక్ వాహనాలు, ఆప్టిక్స్.. మొదలైన వాటి నుంచి జాబ్స్ సృష్టించవచ్చునని అన్నారు. ఇవేమీ చేయకుండా మేక్ ఇన్ ఇండియా అని స్పేర్ పార్ట్స్ తెచ్చుకుని అసెంబుల్ చేస్తూ గొప్పలు చెప్పుకోవడం వలన లాభం లేదని విమర్శించారు.
क्या आप जानते हैं कि भारत में बने ज़्यादातर TVs का 80% हिस्सा चीन से आता है?
— Rahul Gandhi (@RahulGandhi) July 19, 2025
‘मेक इन इंडिया’ के नाम पर हम सिर्फ असेंबली कर रहे हैं - असली मैन्युफैक्चरिंग नहीं। iPhone से लेकर TV तक - पुर्ज़े विदेश से आते हैं, हम बस जोड़ते हैं।
छोटे उद्यमी निर्माण करना चाहते हैं, लेकिन न नीति… pic.twitter.com/xNVXbRjuei