ఒక్కడే..మహిళపై అత్యాచారం చేయలేడు: కర్నాటక కాంగ్రెస్ లీడర్ వివాదస్పద వ్యాఖ్యలు

ఒక్కడే..మహిళపై అత్యాచారం చేయలేడు: కర్నాటక కాంగ్రెస్ లీడర్ వివాదస్పద వ్యాఖ్యలు

కర్ణాటక  కాంగ్రెస్ పార్టీ లీడర్ కు చెందిన ఓ ఆడియో ఇప్పుడు సంచలనం చేపుతోంది.. తన అనచరుడు అత్యాచారం చేశాడంటూ ఓ బాధితురాలు ఫిర్యాదు చేయడంతో అది ఎలా సాధ్యం.. ఒక్కడు ఎలా రేప్ చేస్తాడు..ఒక్క చేత్తో ఎవరూ చప్పట్లు కొట్టలేరు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. 

కర్ణాటక కాంగ్రస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ అమర గౌడ పాటిల్ అత్యాచారం చేయడం ఒక్క వ్యక్తికి సాధ్యం కాదని చెప్తున్న ఆడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దుమారం రేగుతోంది. అతని అనుచరుడు సంగన గౌడపై అత్యాచారం చేశాడని ఓ మహిళ పోలీసులు ఫిర్యాదు చేయడంతో అమరగౌడ ఈ వ్యాఖ్యలు చేశారు. 

2023 అక్టోబర్ 10న కొప్పల్ మహిళా పోలీస్ స్టేషన్ లో సంగనగౌడపై మహిళ ఫిర్యాదు చేసింది. అయినా పోలీసులు స్పందించకపోవడంతో బాధితురాలి బంధువు అమరగౌడ పాటిల్ ను సంప్రదించగా... తనకు బదులుగా పోలీసులకు ఫిర్యాదు చేసినందుకు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారని.. ఆ సమయంలో ఈ వ్యాఖ్యలు చేయగా ఆడియో వైరల్ అవుతోంది.

ఒక వ్యక్తి అత్యాచారం ఎలా సాధ్యం? ఇద్దరు వ్యక్తులు అంతకంటే ఎక్కువ మంది ఉన్నప్పుడే ఇది సాధ్యమవుతుంది.. మీరు ఒక వ్యక్తిని పంపించండి.. నేను ఒక మహిళను అతనితో వెళ్లమని అడుగుతాను.. ఆమెపై అత్యాచారం చేయగలడో లేడో  చూద్దాం అని వివాస్పద వ్యాఖ్యలు చేశాడు. అంతేకాదు అత్యాచారం చేసిన నిందితుడిని జైలుకు పంపవచ్చు.. దీని వల్ల మీకు ఏమి లాభం అంటూ.. నిందితుడికి సపోర్ట్ గా మాట్లాడినట్లు ఆడియోలో స్పష్టమవుతోంది. 

అమర గౌడ పాటిల్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వివాదంపై అమరగౌడ పాటిల్ ఇప్పటికీ కూడా స్పందించలేదు.