అసాధ్యమైన పనులను సుసాధ్యం చేసి చూపించారు

 అసాధ్యమైన పనులను సుసాధ్యం చేసి చూపించారు

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇవాళ 72వ వసంతంలోకి అడుగుపెట్టారు. సెప్టెంబర్ 17,1950న గుజరాత్‌లోని మెహసానా జిల్లాలోని వాద్‌నగర్‌లో మోడీ జన్మించారు.ఈ సందర్భంగా పలుువురు ప్రముఖులు ఆయనకు పుట్టిన రోజులు శుభాకాంక్షలు తెలిపారు. మోడీ నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము  ఆకాంక్షించారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీ కృషి, అంకితభావం, సృజనాత్మకతతో సాగిస్తున్న దేశ నిర్మాణ సంగ్రామం విజయవంతంగా ముందుకు సాగాలని కోరుకుంటున్నానన్నారు. 

సీఎం కేసీఆర్ ప్రధాని మోడీకి బర్త్ డే విషెస్ తెలిపారు. నిండునూరేళ్లు సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. దేశానికి మరి కొన్ని సంవత్సరాలు ఇలాగే సేవ చేయాలని సీఎం కోరారు. ప్రధాన మంత్రి మోడీ పుట్టినరోజు సందర్భంగా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. మోడీజీ దార్శనికత, కృషి, అంకితభావం, నాయకత్వం దేశ సర్వతోముఖ ప్రగతికి కొత్త ఊపునిచ్చాయి. దేశసేవలో వారు సుదీర్ఘమైన, సంతోషకరమైన, ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపాలని ఆకాంక్షిస్తున్నానని ట్వీట్ చేశారు.

ఈ సందర్భంగా ప్రధాని మోడీకి కేంద్రం హోంమంత్రి అమిత్ షా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. దేశానికి అత్యంత ప్రియమైన నాయకుడు, అందరికీ స్ఫూర్తి అని కొనియాడారు. మోడీ తన ఆలోచనలతో అసాధ్యమైన పనులను సైతం సుసాధ్యం చేసి చూపించారని ట్వీట్ చేశారు.