ఆకట్టుకుంటున్న జ్యోతి పూర్వజ్ ‘విచిత్ర’ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్

ఆకట్టుకుంటున్న జ్యోతి పూర్వజ్ ‘విచిత్ర’ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్

జ్యోతి పూర్వజ్ లీడ్‌‌‌‌ రోల్‌‌‌‌లో సైఫుద్దీన్ మాలిక్ దర్శక నిర్మాతగా రూపొందించిన చిత్రం ‘విచిత్ర’. మే 22న సినిమా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఆదివారం  ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌‌‌‌‌‌‌‌ను దర్శకుల సంఘం అధ్యక్షులు వి.ఎన్ ఆదిత్య లాంచ్ చేసి టీమ్‌‌‌‌కు బెస్ట్ విషెస్ చెప్పారు. ఇదొక హారర్ థ్రిల్లర్ అని, అవుట్‌‌‌‌పుట్ చాలా బాగా వచ్చిందని, వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నామని దర్శక నిర్మాత సైఫుద్దీన్ అన్నారు. శ్రేయ తివారి, బేబీ శ్రీ హర్షిణి, రవి ప్రకాష్, సూర్య, ఛత్రపతికి శేఖర్, జబర్దస్త్ అప్పారావు ఇతర పాత్రలు పోషించారు.