పాక్​మాజీ ప్రధాని ఇమ్రాన్ పై మరో ఆరు కేసులు

పాక్​మాజీ ప్రధాని ఇమ్రాన్ పై మరో ఆరు కేసులు

ఇస్లామాబాద్​: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌‌పై మరో 6 కేసులు నమో దయ్యాయి. ఇందులో మూడు కఠినమైన ఉగ్రవాద నిరోధక చట్టం కింద ఉన్నాయి. మే 9న రావల్పిండిలోని పాక్ ఆర్మీ జనరల్ హెడ్‌‌క్వార్టర్స్ పై దాడి చేసినందు కు ఈ కేసులు ఫైల్​ చేశారు. అవినీతి ఆరోపణల కేసులో ఇమ్రాన్‌‌ ఖాన్‌‌ని ఇస్లా మాబాద్‌‌ హైకోర్టు ఆవరణలో అరెస్టు చేయడంతో మే 9న దేశవ్యాప్తంగా హిం సాత్మక ఘటనలు చెలరేగాయి. 

ఇమ్రాన్​ఖాన్​కు చెందిన పాకిస్తాన్ ​తెహ్రీక్​ఇ ఇన్సాఫ్ పార్టీ​ మద్దతుదారులు పాక్ ఆర్మీ హెడ్‌‌క్వార్టర్స్ పై దాడి చేశారు. ఈ ఘటనలో నమోదు చేసిన ఆరు కేసుల్లో ఇమ్రాన్​ఖాన్​పేరు యాడ్​ చేశారు. కాగా,  గత ఏడాది ఏప్రిల్‌‌లో పదవిని కోల్పోయినప్పటి నుంచి ఇమ్రాన్ ఖాన్ పై దేశవ్యాప్తంగా దాదాపు 150 కేసులు నమోదు అయ్యాయి.