ఈ బిందీ కథేంది? ఇందులో నిజమెంత?

ఈ బిందీ కథేంది? ఇందులో నిజమెంత?

అయోడిన్​ బిందీ.. రెండు రోజులుగా సోషల్​ మీడియాలో చక్కెర్లు కొడుతున్న పేరు. వీటినే ‘లైఫ్​ సేవింగ్​ డాట్​-జీవన్​ బిందీ’ అని కూడా పిలుస్తారు. ఈ బొట్టు బిళ్ల పెట్టుకుంటే థైరాయిడ్​ దరిచేరదు.. క్యాన్సర్​  దూరం పోతుందంటూ  మెసేజ్​లు వైరల్​ అవుతున్నాయి. ఆ ముచ్చట్లలో నిజమెంత? అసలు ఈ బొట్టుబిళ్లకి, ఆరోగ్యానికి సంబంధం ఏంటి? 
 

ఐదో నేషనల్​ ఫ్యామిలీ హెల్త్​ సర్వే ప్రకారం మనదేశంలో 167 మిలియన్ల​ మంది ఐడిడి( అయోడిన్​ డెఫిషియెన్సీ డిజార్డర్​)తో బాధపడుతున్నారు. ఈ లోపం వల్ల  50 లక్షల 7 వేల మంది గాయిటర్​, 20 లక్షల మంది మానసిక వైకల్యంతో ఇబ్బంది పడుతున్నారు. మరీ ముఖ్యంగా ఆడవాళ్లలో రోజురోజుకి అయోడిన్​ లోపం పెరుగుతోంది. ఆడవాళ్లలో ఈ అయోడిన్​ లోపం ​థైరాయిడ్​​, బ్రెస్ట్​ క్యాన్సర్​ , ఫైబ్రాయిడ్స్​కి దారి తీస్తోంది. గర్భిణులకి అయోడిన్​ లోపం ఉంటే పుట్టబోయే పిల్లల్లో మానసిక ఎదుగుదల సరిగా ఉండదని డాక్టర్లు చెబుతున్నారు. ఈ సమస్యని గుర్తించి 2005వ సంవత్సరంలో సెంట్రల్​ గవర్నమెంట్​ అయోడైజ్డ్​​ సాల్ట్  మాత్రమే అమ్మాలని చెప్పింది. కానీ, రూరల్ ఏరియాల్లో ఈ ఉప్పు అంతగా అందుబాటులో లేదు.. పైగా రేటు ఎక్కువ కావడంతో  కొందరు కొనలేరు కూడా. అలాంటి వాళ్లకి బెస్ట్​ సొల్యూషన్​ అయోడిన్​ బిందీలు. అయోడిన్​తో తయారుచేసిన ఈ  బొట్టుబిళ్ల పెట్టుకుంటే చర్మం లోపలకి అయోడిన్​ చేరుతుంది. అదెలాగంటే.. అయోడిన్​ డెఫిషియెన్సీ టెస్ట్​ చేయడానికి అయోడిన్​ ప్యాచ్​లని భుజాలకి లేదా పొట్టపై అతికిస్తారు. శరీరంలో అయోడిన్​ లోపం ఉంటే ఆ ప్యాచ్​ల ద్వారా అయోడిన్​ శరీరంలోకి పోతుంది. సరిగా అలాగే ఈ అయోడిన్​ బిందీలు కూడా పనిచేస్తాయి. 
ఎనిమిది గంటలు చాలు
ఆడవాళ్లని అయోడిన్​ డిజార్డర్స్​ నుంచి బయటపడేయడానికి అలీ షబాజ్​ అనే వ్యక్తికి వచ్చిన ఆలోచన ఇది. అలీ మన దేశానికి చెందినవాడే అయినా సింగపూర్​లో సెటిల్​ అయ్యాడు. సింగపూర్​కి చెందిన గ్రే గ్రూప్​ కంపెనీలో చీఫ్ క్రియేటివ్​ ఆఫీసర్​గా పనిచేసేవాడు. మన దేశంలోని ఆడవాళ్లు అయోడిన్​ లోపంతో పడుతున్న ఇబ్బందులు చూశాక ఈ బిందీల ఐడియా తట్టింది అలీకి. అంతే నాసిక్‌‌లోని నీల్‌‌వసంత్ మెడికల్ ఫౌండేషన్​తో కలిసి 2015లో ‘లైఫ్​ సేవింగ్​ ప్రాజెక్ట్’​ పేరుతో ఈ బొట్టుబిళ్లలు తయారుచేశాడు. 100 నుంచి 150 మైక్రో గ్రాముల అయోడిన్‌‌తో తయారు చేసిన వీటిని ఎనిమిది గంటలు పెట్టుకుంటే చాలు, ఆ రోజుకు కావాల్సిన  అయోడిన్‌‌ శరీరానికి  అందుతుంది. 
ధర చాలా తక్కువ
ప్యాచ్​లా ఉండే ఈ  అయోడిన్​ బొట్టు బిళ్లలు  కెమికల్​ ఫ్రీ. వీటివల్ల ఎలాంటి సైడ్​ ఎఫెక్ట్స్​  ఉండవు. పైగా ధర కూడా చాలా తక్కువ. 30 బిందీలున్న ఈ ప్యాకెట్ రెండు రూపాయలే.  అయోడిన్​ సప్లిమెంట్స్​ కొనే స్థోమత లేనివాళ్లకి ఇవి బెస్ట్ ఆప్షన్​.  అన్ని రకాలు రంగుల్లోనూ ఈ బొట్టుబిళ్లలు వస్తున్నాయి. ఇప్పటికే మహారాష్ట్రలోని కొన్ని రూరల్​ ఏరియాల్లోని ఆడవాళ్లపై ఈ బిందీలని టెస్ట్​ చేశారు. భవిష్యత్​​లో వీటిని దేశవ్యాప్తంగా అందరికీ అందుబాటులోకి తెచ్చే ఆలోచనలో ఉంది గ్రే గ్రూప్​ కంపెనీ.  ఎవరైనా మా ఫార్ములాతో  అయోడిన్​ బొట్టుబిళ్లల్ని తయారుచేయడానికి ముందుకొచ్చినా  మేం సిద్ధమే అంటోంది ఈ కంపెనీ.