శామ్యూల్స్‌‌‌‌‌‌‌‌పై ఆరేండ్ల బ్యాన్‌‌‌‌‌‌‌‌

శామ్యూల్స్‌‌‌‌‌‌‌‌పై ఆరేండ్ల బ్యాన్‌‌‌‌‌‌‌‌

దుబాయ్‌‌‌‌‌‌‌‌: వెస్టిండీస్‌‌‌‌‌‌‌‌ మాజీ ప్లేయర్‌‌‌‌‌‌‌‌ మార్లోన్‌‌‌‌‌‌‌‌ శామ్యూల్స్‌‌‌‌‌‌‌‌పై ఐసీసీ  కొరడా ఝుళిపించింది. 2019లో అబుదాబి టీ10 లీగ్‌‌‌‌‌‌‌‌ సందర్భంగా అవినీతి నిరోధక కోడ్‌‌‌‌‌‌‌‌ను ఉల్లంఘించినందుకు అతనిపై ఆరేళ్ల నిషేధం విధించింది. అన్ని ఫార్మాట్లకు దూరంగా ఉండాలని హెచ్చరించింది. లీగ్‌‌‌‌‌‌‌‌ టైమ్‌‌‌‌‌‌‌‌లో బయటి వ్యక్తుల నుంచి గిఫ్ట్‌‌‌‌‌‌‌‌లు తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై విచారణ జరిపేందుకు 2021లో విచారణ కమిటీని నియమించారు. 

ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపిన కమిటీ శామ్యూల్స్‌‌‌‌‌‌‌‌పై నాలుగు అభియోగాలు మోపింది. దోషిగా తేలిన అతనిపై ఐసీసీ వేటు వేసింది. ప్రస్తుతం శామ్యూల్స్‌‌‌‌‌‌‌‌ రిటైర్ అయినా నేరం జరిగినప్పుడు క్రికెటర్‌‌‌‌‌‌‌‌గా కొనసాగాడు. ‘శామ్యూల్స్‌‌‌‌‌‌‌‌ దాదాపు రెండు దశాబ్దాలు ఇంటర్నేషనల్‌‌‌‌‌‌‌‌ క్రికెట్‌‌‌‌‌‌‌‌ ఆడాడు. అతని బాధ్యతలు ఏంటో బాగా తెలుసు. అయినా కోడ్‌‌‌‌‌‌‌‌ను ఉల్లంఘించి అవినీతికి పాల్పడ్డాడు. రిటైర్మెంట్‌‌‌‌‌‌‌‌ ప్రకటించినప్పటికీ అతనిపై బ్యాన్‌‌‌‌‌‌‌‌ విధించడం సరైందే’ అని ఐసీసీ జనరల్‌‌‌‌‌‌‌‌ మేనేజర్‌‌‌‌‌‌‌‌, ఇంటెగ్రిటి యూనిట్‌‌‌‌‌‌‌‌ హెచ్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ అలెక్స్‌‌‌‌‌‌‌‌ మార్షల్‌‌‌‌‌‌‌‌ వెల్లడించాడు.