నేషనల్ హైవేపై దారి దోపిడీ.. తుపాకులతో బెదిరించి దోచుకున్నారు

నేషనల్ హైవేపై దారి దోపిడీ.. తుపాకులతో బెదిరించి దోచుకున్నారు

పట్టపగలు నడిరోడ్డుపై బెదిరించి డబ్బులు ఎత్తుకెళ్లిన ఘటన ఢిల్లీలో జరిగింది.  దేశ రాజధానిలో జరిగిన ఈ సంఘటన దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన తాలూకు వివరాలను పోలీసులు వెల్లడించారు. చాందినీ చౌక్ లో డెలివరీ ఏజెంట్​గా పని చేస్తున్న ఓ వ్యక్తి, అతని సహచరుడు రూ.3.5 లక్షలతో తమ కారులో గుర్గావ్​ వెళ్తున్నారు. థక్​ థక్​ గ్యాంగ్​కి చెందిన నలుగురు దుండగులు వారిని వెనక నుంచి ఫాలో అయ్యారు. ప్రగతి మైదాన్​ సొరంగంలోకి రాగానే కారు ముందు వారి బైక్ లను అడ్డుగా ఆపారు.

వెంటనే దిగి తమ వెంట తెచ్చుకున్న తుపాకులతో కారులో ఉన్న ఇరువురిని బెదరించారు. రూ.3.5 లక్షలు ఉన్న బ్యాగ్​ తీసుకుని అక్కడ నుంచి పరారయ్యారు. ఈ క్రమంలో పక్కనే వెళ్తున్న వాహనదారులు ఏం జరుగుతోందో గమనించే లోపే పని పూర్తి చేసుకున్నారు.  బాధితుల ఫిర్యాదు తో తిలక్​ మార్గ్​ పోలీస్​ స్టేషన్​లో  కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన జూన్​24 న జరిగింది. 

ALSO READ:కేసీఆర్ తో పెట్టుకున్న వాళ్లెవరూ బాగుపడలే: కేటీఆర్

ఎల్​జీ రాజీనామా చేయాలి..

దోపిడీ సంబంధించిన వీడియోను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రివాల్​ ట్విటర్​లో షేర్​ చేశారు. ఈ ఘటనకు బాధ్యులుగా లెఫ్టినెంట్​ గవర్నర్ వీకే సక్సేనా పదవి నుంచి దిగిపోవాలని డిమాండ్​ చేశారు. దేశ రాజధానిలో శాంతి భద్రతలు పర్యవేక్షించడంలో కేంద్రం విఫలమైందని విమర్శించారు. ఢిల్లీని కాపాడలేని పరిస్థితిలో ఉంటే తమకు ఆ బాధ్యతలు అప్పగించాలన్నారు. తాము శాంతి భద్రతలు కాపాడతామని కేజ్రివాల్​ చెప్పారు.