ఇండియాకు ఇటాలియన్ ఆస్ట్రోనాట్ శుభాకాంక్షలు

ఇండియాకు ఇటాలియన్ ఆస్ట్రోనాట్ శుభాకాంక్షలు

న్యూఢిల్లీ: 75 ఏండ్ల స్వతంత్ర సంబురాలను పురస్కరించుకుని  ఇటాలియన్ ఆస్ట్రోనాట్ సమాంత క్రిస్టోఫరెట్టి అంతరిక్షం నుంచి మనదేశానికి స్పెషల్ విషెస్ చెప్పారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో ఉన్న ఆమె వీడియో మెసేజ్​ పంపారు. వచ్చే ఏడాది ఇస్రో చేపట్టే  ‘గగన్ యాన్’ సక్సెస్ కావాలని ఆమె ఆకాంక్షించారు. ‘‘నాసా, ఇతర ఇంటర్నేషనల్ పార్ట్​నర్స్ అందరి తరఫునా ఇస్రోకు బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నా” అని ఆమె తెలిపారు. విక్రమ్ సారాభాయ్ 103వ జయంతి (ఆగస్ట్ 12) సందర్భంగా సమాంత వీడియో మెసేజ్​ను యూఎస్​లో ఇండియన్ అంబాసిడర్ తరణ్ జిత్ సింగ్ సంధూ ట్విట్టర్​లో షేర్ చేశారు.