డెన్మార్క్ లో ప్రధాని మోడీకి ఘన స్వాగతం

డెన్మార్క్ లో ప్రధాని మోడీకి ఘన స్వాగతం

భారత్, యూరోపియన్ యూనియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ త్వరలోనే పూర్తవుతుందని నరేంద్రమోడీ అన్నారు. డెన్మార్క్ తో పలు రంగాల్లో ఒప్పందాలు చేసుకున్న తర్వాత రెండు దేశాల ప్రధానమంత్రులు మాట్లాడారు. భారత్-ఫసిఫిక్ తో పాటు.. ఉక్రెయిన్ ఇష్యూపైన చర్చించినట్టు మోడీ చెప్పారు. భారత్ లో మౌలిక వసతుల రంగంలో, గ్రీన్ ఇండస్ట్రీస్ లో పెట్టుబడులకు చాలా అవకాశాలు ఉన్నాయన్నారు. రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయబోతున్నట్టు డానిష్ ప్రధానమంత్రి మెట్ ఫ్రెడరిక్‌సన్‌ చెప్పారు . 

డెన్మార్క్‌ పర్యటనలో భాగంగా డానిష్  ప్రధానమంత్రి మెట్ ఫ్రెడరిక్‌సన్‌తో ప్రధాని నరేంద్ర మోడీ భేటీ అయ్యారు. కొపెన్‌హాగన్‌లోని ప్రధాని నివాసంలో ఈ సమావేశం జరిగింది. బ్యాక్‌యార్డ్‌లో నడుస్తూ ఇద్దరు ఏకాంతంగా చర్చలు జరిపారు. భారత్‌-డెన్మార్క్‌ ద్వైపాక్షిక అంశాలపై ఇరు దేశాధినేతలు చర్చించారు. అనంతరం ప్రతినిధుల స్థాయి సమావేశం జరిగింది. మూడు రోజుల యూరప్‌ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ డెన్మార్క్‌ చేరుకున్నారు. కొపెన్‌హాగన్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ప్రధాని మోడీకి.. డానిష్‌ పీఎం మెట్టె ఫ్రెడరిక్సన్‌ సాదర స్వాగతం పలికారు.

డెన్మార్క్, ఐస్లాండ్, ఫిన్లాండ్, స్వీడన్, నార్వే దేశాధినేతలతో మోడీ భేటీ అవుతారు. కొపెన్‌హాగన్‌లో భారత్-నార్డిక్ సదస్సులో పాల్గొంటారు. డెన్మార్క్ నుంచి భారత్ తిరిగి వస్తూ పారిస్‌లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మెక్రాన్‌ను ప్రధాని కలవనున్నారు. ఇక యూరప్‌ పర్యటనలో భాగంగా జర్మనీ నుంచి డెన్మార్క్ బయల్జేరి వెళ్లారు. ప్రధాని బస చేస్తున్న హోటల్ వద్దకు ప్రవాస భారతీయులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి వీడ్కోలు పలికారు. 

 

మరిన్ని వార్తల కోసం

 

ఒకే మండపంలో ముగ్గుర్ని పెళ్లి చేసుకున్న మాజీ సర్పంచ్

ఓయూలో రాహుల్ సభను ఎవరూ అడ్డుకోలేరు