90 సార్లు టీకా వేస్కున్నడు

90 సార్లు టీకా వేస్కున్నడు

బెర్లిన్: జర్మనీలో ఓ వ్యక్తి ఏకంగా 90 సార్లు కరోనా వ్యాక్సిన్ తీసుకున్నాడు. మాగ్డెబర్గ్ సిటీకి చెందిన 60 ఏండ్ల వ్యక్తి టీకా సర్టిఫికెట్ల కోసం ఇన్నిసార్లు టీకా తీసుకున్నాడట. టీకా తీసుకోగా వచ్చిన సర్టిఫికెట్​ను ఫోర్జరీ చేసి అవసరమున్నోళ్లకు అమ్ముకున్నట్లు తేలింది. గురువారం మరోసారి టీకా తీసుకుందామని ఐలెన్ బర్గ్​లోని ఓ సెంటర్​కు రాగా.. పోలీసులకు అనుమానం వచ్చి పట్టుకున్నారు. అతని ఇంటి నుంచి ఊరు, పేరు లేని టీకా సర్టిఫికెట్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. జర్మనీలో విమానాలు ఎక్కాలన్నా.. రెస్టారెంట్లు, థియేటర్లలోకి పోవాలన్నా.. టీకా సర్టిఫికెట్​ తప్పనిసరి. దీంతో టీకా వేసుకోనోళ్లు కొందరు ఫేక్ సర్టిఫికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఇదే చాన్స్ అనుకున్న ఆ వృద్ధుడు సర్టిఫికెట్లను సొమ్ముచేసుకున్నట్లు తేలింది.  అయితే, ఇన్ని టీకాలు తీసుకున్న ఆ వ్యక్తి ఆరోగ్యం ప్రస్తుతం బాగానే ఉన్నా.. ఆ తర్వాత ఎలా ఉండనుందో చూడాలని చెప్తున్నారు