
కరీంనగర్ క్రైం, వెలుగు : ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో సైబర్ నేరగాళ్లు ఓ యువకుడి నుంచి రూ. 93 వేలు వసూలు చేశారు. వివరాల్లోకి వెళ్తే... కరీంనగర్‌లోని మారుతీనగర్‌కు చెందిన శ్రీరామోజు రఘు అనే యువకుడి మొబైల్‌కు ఆన్‌లైన్ ట్రేడింగ్‌కు సంబంధించిన ఓ లింక్ వచ్చింది.
దానిని ఓపెన్ చేయగానే రూ. 20 వేలు ఇన్వెస్ట్ చేస్తే లాభాలు వస్తాయంటూ సైబర్ నేరగాళ్లు చెప్పడంతో నిజమేనని నమ్మిన రఘు వారు పంపిన క్యూఆర్ కోడ్‌కు రూ. 20 వేలు పంపించాడు. ఆ తర్వాత పలు విడతలుగా మొత్తం రూ. 93 వేలు వసూలు చేశారు.
డబ్బులు తిరిగి రాకపోవడం, వారి నుంచి స్పందన లేకపోవడంతో మోసపోయినట్లు గ్రహించిన రఘు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు త్రీటౌన్ సీఐ జాన్‌రెడ్డి తెలిపారు.