కార్తీకమాసంలో యాదాద్రికి గతేడాదితో పోల్చితే రెట్టింపు ఇన్​కం

కార్తీకమాసంలో యాదాద్రికి గతేడాదితో పోల్చితే రెట్టింపు ఇన్​కం

నేడు హుండీ లెక్కింపు

యాదగిరిగుట్ట, వెలుగు : కార్తీకమాసంలో యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఖజానాకు భారీగా ఆదాయం సమకూరింది. గత ఏడాది కార్తీకమాసంలో వచ్చిన ఆదాయంతో పోల్చితే ఈ సారి ఏకంగా రూ.7,31,27,790 ఎక్కువ వచ్చిందని ఆలయ ఆఫీసర్లు చెప్పారు. అక్టోబర్ 26న మొదలైన కార్తీకమాసం నవంబర్ 23న ముగిసింది. ఈ 28 రోజుల్లో భక్తుల పూజల ద్వారా రూ.14,66,38,097 ఆదాయం రాగా, 2021 కార్తీక మాసంలో రూ.7,35,10,307 వచ్చింది. 

2021 కార్తీక మాసంలో జరిగిన సత్యనారాయణస్వామి వ్రతాలతో పోల్చితే ఈసారి 2,304 వ్రతాలు ఎక్కువగా జరిగాయి. ఈ సారి 21,480 వ్రతాలు నిర్వహించగా రూ.1,71,84,000 ఆదాయం సమకూరింది. గురువారం హుండీ లెక్కింపు ఉంటుందని, దీనికి కార్తీక ఆదాయాన్ని కలిపితే పూర్తి ఆదాయం వస్తుందని ఈఓ గీతారెడ్డి తెలిపారు.