ఇంటి వద్దకే బుక్స్

ఇంటి వద్దకే బుక్స్
  • పుస్తక ప్రియుల కోసం తిరువనంతపురంలో ‘బుక్స్ బై బైసికల్’

తిరువనంతపురం: లాక్ డౌన్ సమయంలో లైబ్రరీలు, బుక్ స్టాళ్లు మూతపడటంతో పుస్తక ప్రియుల కోసం కేరళ రాజధాని తిరువనంతపురంలో కొత్త కార్యక్రమం చేపట్టారు. ‘బుక్స్ బై బైసికల్’ పేరుతో ఇంటి వద్దకే పుస్తకాలు సప్లయ్ చేస్తున్నారు. తిరువనంతపురం మేయర్ గోపినాథ్ ఈ వినూత్న కార్యక్రమం మొదలుపెట్టారు. ప్రజలు తమకు ఇష్టమైన బుక్ ఆర్డర్ ఇస్తే.. వలంటీర్లు సైకిల్ పై ఇంటి వద్దకే వెళ్లి డెలివరీ ఇస్తారని ఆర్గనైజర్లు చెప్పారు. క్యాష్, గూగుల్ పే, పేటీఎం ద్వారా డబ్బులు చెల్లించవచ్చన్నారు. ఇంగ్లిష్, మలయాళం పుస్తకాలతోపాటు పిల్లల పుస్తకాలను డిస్కౌంట్ రేట్లలో అందిస్తున్నామన్నారు. డీసీ బుక్స్, మాతృభూమి బుక్స్ లాంటి బుక్ హౌస్ ల సహకారంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు. మార్కెట్ లోకి వచ్చిన లేటెస్ట్ బుక్స్, అందుబాటులో ఉన్న బుక్స్ వివరాలను ‘బుక్స్ బై బైసికల్’ ఫేస్ బుక్ అకౌంట్, వాట్సప్ గ్రూప్ ద్వారా పుస్తక ప్రియులకు అందిస్తామన్నారు. ప్రస్తుతం తిరువనంతపురంలో మాత్రమే ఈ సేవలు అందుబాటులో ఉన్నాయని, 10 శాతం డిస్కౌంట్ కూడా ఇస్తున్నట్లు తెలిపారు.