తుమ్మిళ్ల లిఫ్ట్ నిలిచిపోవడంతో ఎండుతున్న పంటలు

తుమ్మిళ్ల లిఫ్ట్  నిలిచిపోవడంతో ఎండుతున్న పంటలు

మానవపాడు, వెలుగు: తుమ్మిళ్ల లిఫ్ట్ 15 రోజుల కింద ఆఫ్  కావడంతో సాగునీరు లేక మిర్చి, పత్తి పంటలు ఎండిపోతున్నాయి. రైతులు ఇబ్బందులు పడుతుండగా, ఎమ్మెల్యే డాక్టర్  అబ్రహం మండల కేంద్రానికి చేరుకుని ఇరిగేషన్  ఆఫీసర్లతో మాట్లాడారు. సాగునీటిని ఎప్పుడు విడుదల చేస్తారని అడిగారు. ప్రస్తుతం 15 క్యూసెక్కుల నీటిని విడుదల చేశామని, కర్నూలు జిల్లా ఆఫీసర్లు 15 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తే తుమ్మిళ్ల మోటార్లకు నీరు అందుతుందని చెప్పారు. ఆయన వెంట వెంకట్రాముడు, దామోదర్ రెడ్డి, హుస్సేన్, నాగేశ్​రెడ్డి పాల్గొన్నారు. 

ధర్నా నిర్వహిస్తాం

తుమ్మిళ్ల లిఫ్ట్​ నుంచి వెంటనే సాగునీటిని అందించాలని మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్  డిమాండ్​ చేశారు. మంగళవారం కెనాల్​ను రైతులు, పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. వెంటనే సాగునీటిని అందించాలని, లేదంటే రైతులతో కలిసి ఉద్యమం చేస్తానన్నారు. జగన్, పరమేశ్, భీంరెడ్డి, రాముడు, హుస్సేన్ పాల్గొన్నారు.