
ఇంపాల్: మణిపూర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. నోనీ జిల్లాలో కొండచరియలు ఆర్మీ బేస్ క్యాంప్‌పై విరిగిపడటంతో ఏడుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. 45 మంది గల్లంతయ్యారు. జిరిబామ్ నుంచి ఇంఫాల్ వరకు రైల్వే లైన్ నిర్మాణంలో ఉంది. దీని రక్షణ కోసం టుపుల్ రైల్వే స్టేషన్ సమీపంలో 107 టెరిటోరియల్ ఆర్మీ బేస్ క్యాంప్‌ని ఏర్పాటు చేశారు.
"Visited Tupul to take stock of unfortunate landslide situation. I’m thankful to Hon’ble HM Shri Amit Shah Ji for calling me to assess the situation & assured all possible assistance. A team of NDRF has already reached site for rescue operation," tweets CM Manipur, N Biren Singh pic.twitter.com/przrK9gp9L
— ANI (@ANI) June 30, 2022
బుధవారం (జూన్ 29న) అర్ధరాత్రి సమయంలో ఆ బేస్ క్యాంప్‌పై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఏడుగురు జవాన్లు అక్కడికక్కడే మృతి చెందగా, 45 మంది ఆచూకీ గల్లంతైంది. మరోవైపు శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఆర్మీ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది. ఈ ఘటనపై మణిపూర్ సీఎం బిరేన్ సింగ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.
Noney, Manipur | Massive landslide triggered by incessant rains caused damage to Tupul station building of ongoing Jiribam – Imphal new line project. Landslide also stuck the track formation, camps of construction workers. Rescue operations in progress: NF Railway CPRO pic.twitter.com/5fzxzQcCki
— ANI (@ANI) June 30, 2022
Noney, Manipur | 7 bodies have been recovered so far. Rescued people being shifted to hospital. Around 45 persons are still missing: Solomon L Fimate, SDO of Noney district pic.twitter.com/PZD8DEyWA2
— ANI (@ANI) June 30, 2022