పిల్లలు పరీక్ష కాపీ కొట్టొద్దని..

పిల్లలు పరీక్ష కాపీ కొట్టొద్దని..

స్కూల్లగానీ, కాలేజీలగానీ సక్కగ సదవని స్టూడెంట్లు పక్కోళ్ల దాంట్ల చూసి కాపీ కొడుతుంటరు. కాపీ, కొట్టకుండా ఇన్విజిలేటర్లు కాలు గాలిన పిల్లి లాగా అటు ఇటు తిరుగుతుంటరు. అయినా, ఇన్విజిలేటర్​ అట్ల పోతడో లేదో కాపీ కొట్టేస్తుంటరు పిలగాళ్లు. ఇగో సూడురి పిల్లల తలకాయలకు కాటన్​ పెట్టెలు పెట్టిన్రు లే. ఎందుకనుకుంటున్నరు? పిల్లలు పరీక్ష కాపీ కొట్టకుండా ఉండేటందుకే. మెక్సికోలోని ట్లాష్కాలా అనే రాష్ట్రంలోని బ్యాచిలర్స్​ 01 ఎల్​ సబినాల్​ స్కూల్​లో జరిగిందీ చిత్రం. అగో, మా పిల్లల తలకాయలకు గిట్ల అట్టపెట్టెలు పెడతరా అంటూ తల్లిదండ్రులు, ఈ ఐడియా చేసిన స్కూల్​ టీచర్​పై ఒంటి కాలిమీద లేచిర్రట. ఆ టీచర్​ స్కూల్ల ఉండనే ఉండొద్దంటూ ధర్నాకు దిగిర్రట. ఎథిక్స్​ అండ్​ వాల్యూస్​ అనే సబ్జెక్ట్​ చెప్పే లూయిస్​ జువారెజ్​ టెక్సిస్​ అనే టీచర్​ ఈ పని చేసిండట. విలువలు చెప్పే టీచర్​ కదా.. ఆ మాత్రం చేస్తే ఏం కాదులె అనుకున్నడో ఏమో ఇట్ల తలకాయలకు అట్టపెట్టెలు పెట్టించిండు. అది అట్లుంటే బ్యాంకాక్​లోని కేసెట్​సార్ట్​ అనే యూనివర్సిటోళ్లు స్టూడెంట్ల తలలకు అడ్డంగా పేపర్​ హ్యాట్లు తగిలించిన్రు. వాటికి స్పెషల్​ బ్లింకర్లు అని పేరు పెట్టిన్రు. ఈ సెటప్​ కూడా పిల్లలు పరీక్షలో కాపీ కొట్టకుండా ఉండేందుకేనట.