నా దృష్టిలో మంచిగా ఆలోచించడమే దైవత్వం

నా దృష్టిలో మంచిగా ఆలోచించడమే దైవత్వం

‘అ..ఆ..’తో ఆరేళ్ల క్రితం టాలీవుడ్‌‌కు పరిచయమైన అనుపమ పరమేశ్వరన్ అతి కొద్దికాలంలో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. తెలుగులో వరుస సినిమాలు చేస్తోన్న ఆమె, నిఖిల్‌‌తో కలిసి ‘కార్తికేయ 2’లో నటించింది. ఇటీవల విడుదలై సక్సెస్‌‌ టాక్‌‌ను అందుకున్న ఈ సినిమా గురించి అనుపమ ఇలా ముచ్చటించింది. 

‘పక్కింటమ్మాయి పాత్రలు పక్కనబెట్టి డిఫరెంట్ రోల్స్‌‌ చేయాలని ఫిక్స్ అయిన టైమ్‌‌లో ఈ మూవీ స్టోరీ చెప్పారు డైరెక్టర్ చందూ మొండేటి. దేవుడు, ఆధ్యాత్మికతకు సంబంధించి చిన్నప్పటి నుంచి నాకున్న కొన్ని డౌట్స్‌‌ ఈ స్టోరీతో క్లియర్‌‌‌‌ అయ్యాయి. అదీకాక ‘ముగ్ధ’ అనే క్యారెక్టర్ కూడా చాలా నచ్చింది. నిజజీవితంలో కూడా డ్రెస్సింగ్‌‌ స్టైల్‌‌తో సహా నేను ముగ్ధలాగే ఉంటాను. వివిధ ప్రాంతాల్లో షూటింగ్ చేయడం, రన్నింగ్, చేజింగ్ లాంటివి కూడా ఇష్టం. కానీ అలాంటి రోల్ చేసే చాన్స్ ఇంతవరకూ రాలేదు. అవన్నీ ఇందులో ఉన్నాయి కనుక వెంటనే ఓకే చెప్పాను. ఇది హిట్ అవుతుందా లేదా అనే దానికంటే మంచి సినిమా అవుతుందని మొదటి నుంచి నమ్మాను. ఈరోజు సక్సెస్ కూడా అవడం బోనస్. నా క్యారెక్టర్‌‌‌‌కు ఇంత అప్లాజ్ రావడానికి నిఖిల్, చందూ‌‌తో పాటు మ్యూజిక్‌‌ డైరెక్టర్‌‌‌‌ కాలభైరవ కారణం. వాళ్లందరికీ థ్యాంక్స్. ఇలాంటి సినిమా షూట్ చేయడం చాలా కష్టం. క్లైమేట్ పరంగా చాలెంజింగ్ మూవీ. ఒకరోజు ఫిఫ్టీ ప్లస్‌‌ టెంపరేచర్‌‌‌‌లో షూట్ చేస్తే, ఆ తర్వాతి రోజు మనాలిలో  మైనస్ ట్వంటీ సిక్స్ టెంపరేచర్‌‌‌‌లో షూట్‌‌కి వెళ్లాం. అక్కడ రోడ్స్ బ్లాక్ అయ్యి స్ట్రక్ అయ్యాం. కానీ మానిటర్‌‌‌‌లో సీన్‌‌ చూసినప్పుడు ఆ కష్టం అంతా మర్చిపోయేవాళ్లం. అయినా కంఫర్ట్‌‌లో పనిచేయడం నాకిష్టం లేదు.. అది చాలా బోరింగ్.

చాలెంజింగ్‌‌ సీన్స్‌‌, రీటేక్స్‌‌ అడగడాన్నే ఇష్టపడతాను. సీన్ చెప్పినప్పుడే ఆ సీన్ ఎలా చేయాలో తెలిస్తే కిక్ ఏం ఉంటుంది. ఎలాంటి కంఫర్ట్స్‌‌ లేకుండా చాలెంజింగ్‌‌గా పనిచేయడమే నాకిష్టం. ఇక ఇంట్లో దీపం వెలిగించడం, గుడికి వెళ్లడం లాంటివి రెస్పెక్ట్ చేస్తాను. అలాగని నేను పర్సనల్‌‌ లైఫ్‌‌లో అవన్నీ చేయను. నా ఐడియాలజీ నాకుంది. భగవంతుడు మనలోనే ఉంటాడు అని నమ్ముతా. నా దృష్టిలో మంచిగా ఆలోచించడమే దైవత్వం. ఇక ఈ సినిమా కంటే ముందే ‘18 పేజెస్‌‌’కి కమిట్ అయ్యా. ఇంచుమించు ఒకే టైమ్‌‌లో షూటింగ్ అయ్యాయి. అదొక ప్యూర్ లవ్‌‌ స్టోరీ. రిలీజ్‌‌కు రెడీ అవుతోంది. ‘బటర్‌‌‌‌ ఫ్లై’ చిత్రం ఓటీటీలో రానుంది. మరో రెండు తెలుగు చిత్రాల్లో నటిస్తున్నా. ఒక యాక్టర్‌‌‌‌గా నాకు కంఫర్ట్‌‌ అనిపించిన పాత్రలు చేస్తాను. గతంలో గ్లామరస్ రోల్స్ రాలేదు. ఇప్పుడు వస్తున్నాయి. కథకు హెల్ప్ అవడంతో పాటు కన్విన్సింగ్‌‌గా అనిపించడం వల్లే ‘రౌడీ బాయ్స్‌‌’లో కిస్సింగ్ సీన్‌‌లో నటించా.’