నాలా పనులు ఎందుకింత స్లో?

 నాలా పనులు ఎందుకింత స్లో?

పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్​లో రూ.110 కోట్లతో ప్రారంభమైన నాలా పనులు స్లోగా సాగుతుండగా.. వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. పర్వతాపూర్ అరోరా కాలేజీ వద్ద రోడ్డుకు అడ్డంగా పైప్​ల నిర్మాణం ఉండటంతో రోడ్లను పూర్తిగా మూసివేశారు. రెండు వారాలు గడుస్తున్నా ఆ పనులను ఇంకా పూర్తిచేయలేదు. 20 మీటర్ల పైప్​లైన్​ వేసేందుకు నెలల టైం తీసుకుంటున్నారు.

పనులు ఆలస్యంగా నడుస్తున్నాయని..ఎగ్జామ్స్​కు హాజరయ్యే స్టూడెంట్లు, ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారని పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు తుంగతుర్తి రవి ఆందోళన వ్యక్తం చేశారు. త్వరగా పూర్తయ్యేలా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

– వెలుగు, మేడిపల్లి