బీజేపీకి ఫుల్ మెజారిటీ వస్తుంది : మోడీ

బీజేపీకి ఫుల్ మెజారిటీ వస్తుంది : మోడీ

ప్రధానమంత్రిగా ఎన్నికైన తర్వాత తొలిసారి ఢిల్లీలో ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడారు నరేంద్రమోడీ. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తో కలిసి మీడియాతో మాట్లాడారు.  భారత ప్రజాస్వామ్యం.. ప్రపంచాన్ని ప్రభావితం చేయాల్సిన అవసరం ఉందన్నారు. పరీక్షలు, స్కూళ్లు, పండుగలు అన్నీ ఎన్నికలతోపాటే జరుగుతున్నాయనీ.. ఇది సంతోషించాల్సిన విషయం అని అన్నారు మోడీ. ఐదేళ్లు పాలించే అవకాశం ఇచ్చినందుకు ప్రజలకు థాంక్స్ చెబుతున్నామని చెప్పారు ప్రచారంలోనూ అదే చెప్పానని అన్నారు మోడీ.

ఎన్నికల ప్రక్రియ నిర్మాణాత్మకంగా పూర్తవుతోందని చెప్పారు మోడీ. ఇందుకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. పూర్తి మెజారిటీతో మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తుందని నమ్మకంగా చెప్పారు మోడీ. దేశాన్ని ఒక ఫ్యామిలీ మాత్రమే పాలించేదనీ.. 2014లో అలా జరగలేదనీ.. 2019లోనూ అలా జరగదనీ చెప్పారు మోడీ.

2014 ఎన్నికల మేనిఫెస్టో హామీలను నెరవేర్చామని చెప్పిన మోడీ.. 2019 మేనిఫెస్టోను కూడా వీలైనంత తొందరగా నెరవేర్చుతామని చెప్పారు.