రిషికేశ్ పుణ్యక్షేత్రం: లక్ష్మణ్ ఝులాను మూసేశారు

రిషికేశ్ పుణ్యక్షేత్రం: లక్ష్మణ్ ఝులాను మూసేశారు

రిషికేశ్ పుణ్యక్షేత్రంలో పర్యాటకులకు ప్రధాన ఆకర్షణగా నిలిచే… లక్ష్మణ్ ఝులా ను మూసేసింది ఉత్తరాఖండ్ ప్రభుత్వం. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే హఠాత్తుగా బ్రిడ్జ్ ను మూసివేస్తున్నట్టు ప్రకటించింది. గంగానదిపై నిర్మించిన లక్ష్మణ్ ఝులా బ్రిడ్జ్ ను రిషికేశ్ వచ్చిన ప్రతీ యాత్రికుడు సందర్శిస్తారు. లక్ష్మణ్ ఝులా శిథిలావస్థకు చేరిందని… ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయని PWD ఇచ్చిన నివేదికతో… బ్రిడ్జ్ ను క్లోజ్ చేసింది ప్రభుత్వం. ఈ నెల 17 నుంచి కన్వార్ యాత్ర ప్రారంభం కానుంది. లక్ష్మణ్ ఝులా బ్రిడ్జ్ మూసివేయడంతో.. కన్వార్ యాత్రికులు మరో రెండు కిలోమీటర్లు నడిచి… రామ్ ఝులా మీదుగా గంగానదిని దాటాల్సి ఉంటుంది.