ఒర్లీన్స్: ఇండియా యంగ్ షట్లర్, వరల్డ్ జూనియర్ చాంపియన్‌షిప్ సిల్వర్ మెడలిస్ట్ తన్వీ శర్మ ఒర్లీన్స్ మాస్టర్స్ సూపర్ 300 టోర్నీలో తన అద్భుత పోరాటాన్ని ముగించింది. శనివారం జరిగిన విమెన్స్ సింగిల్స్ సెమీఫైనల్లో 17 ఏండ్ల తన్వీ 9–-21, 16-–21 తేడాతో మాజీ వరల్డ్ చాంపియన్, జపాన్ స్టార్ నజోమి ఒకుహరా చేతిలో ఓటమి పాలైంది. గతేడాది సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ టోర్నీలో ఒకుహరాను ఓడించిన ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగిన తన్వీ.. ఈ మ్యాచ్‌లో మాత్రం నియంత్రణ కోల్పోయి వరుస తప్పిదాలు చేసి ఓడిపోయింది.
