వింత ప్రచారాలు

వింత ప్రచారాలు

వింత ప్రచారాలు

మన తెలంగాణలో కూడా ఇప్పటికే ప్రచారాలు జోరందుకున్నాయి. అధికార పార్టీ టీఆర్‌ ఎస్‌ సహా కాంగ్రెస్‌ , టీడీపీ, బీజేపీ, ఎంఐఎం, సీపీఐ,సీపీఎం.. ఇలా అన్ని పార్టీలూ ప్రచారంలోకి దూకేస్తున్నాయి. ప్రజల దాకా వెళ్తే తప్ప ఓట్లు పడవు. అలాగే ప్రజల దాకా వెళ్తే తప్ప సమస్యలూ అర్థం కావు. జనాల దగ్గరికి వెళ్లి వాళ్ల సమస్యలు తీరుస్తామని హామీ ఇవ్వకుం డా కొన్ని విం త ప్రచా-
రాలు చేస్తున్న నాయకులపై సోషల్‌ మీడియాలో ట్రోల్స్‌ నడుస్తున్నాయి. చికెన్‌‌ షాప్‌ లో చికెన్‌‌ కొట్టడం, చిన్న పిల్లాడికి స్నానం చేయిం చడం, ఒక అవ్వ చేతిలోని చాటను తీసుకుని బియ్యంలో రాళ్లు ఏరడం, కూరగాయలు అమ్మడం, ఆటో
నడపడం, టిఫిన్‌‌ సెంటర్లో పూరీ, బోం డాలు అమ్మడం ఇలాం టివి రోజూ కనిపిస్తున్నాయి. వీటిపై సోషల్‌ మీడియాలో కామెంట్ స్‌ కాస్త నెగటివ్‌ గానే ఉన్నాయి. ముఖ్యం గా యువత..‘మీరు ఏం చేస్తారో చెప్పాలి కానీ , ఇలాం టి ట్రిక్స్‌ ఎందుకు?’ అని పోస్ట్‌‌లు పెడుతున్నారు. అదే సోషల్‌ మీడియాలో ‘ఓట్ల కోసం ఎన్ని తిప్పలో’ అని ఈ పోస్ట్‌‌లు చూసే ఇంకొం తమంది నవ్వు కుంటున్నారు కూడా!

ఎన్నికలు దగ్గరపడ్డయంటే రాజకీయ నాయకులందరూ జనాల దగ్గరకు రావాల్సిందే! ఏం చేస్తరో చెప్పాలి. ఎట్ల చేస్తరో చెప్పాలి. ఇప్పుడు పదవుల్లో ఉన్నోళ్లు చేయనిది ఏదో దానిగురించి చెప్పాలి. అదే పదవుల్లో ఉన్నోళ్లయితే ఏం చేసినరో చెప్పుకోవాలి. ఇదంతా చిన్న పని కాదు. పెద్ద హంగామా నడవాలి. ఇంత హంగామా నడిచేది.. ఆ ఓట్ల కోసమే!

పాటలే పాటలు.. మన దగ్గర ప్రచారాల హడావిడి ఇలా ఉంటే రాజస్తాన్ పాటల జోరు నడుస్తోంది. స్థా నికంగా బాగా పాపులర్‌ అయిన జానపద పాటలను తీసుకొని వాటి లిరిక్స్‌ మార్చి పాటలు వదులుతున్నారు.
డిసెంబర్‌ 7న తెలంగాణలో ఎన్ని కలు జరుగుతున్న రోజునే రాజస్తాన్ నూ ఎన్ని కలు ఉన్నాయి. కాంగ్రెస్‌, బీజేపీ పోటాపోటీగా ప్రచారాలు చేస్తున్నాయి. ఒకపక్క ప్రస్తుత సీఎం, బీజేపీ లీడర్‌ వసుం ధర
రాజేని పొగుడుతూ బీజేపీ కొన్ని పాటలు తయారుచేస్తే, మరోపక్క కాంగ్రెస్‌ పార్టీ అందుకు ధీటుగా తమ
లీడర్‌ సచిన్‌ పైలట్‌ గొప్పదనాన్ని చెబుతూ పాటలు వదులుతున్నాయి. ఈసారి ఎన్ని కల ప్రచారాల్లో
రాజస్తాన్ పాటలదే హవా! ఇక రెగ్యులర్‌ స్టైల్ లో సాగిపోయే ప్రచారం ఎలాగూ ఉంది.మ్యాజిక్‌ చేస్తం

మధ్యప్రదేశ్ ఈనెల 28న ఎన్నికలు జరగనున్నాయి. అక్కడైతే ఇప్పటికే ప్రచారాలు తారాస్థా యికి చేరిపోయాయి. అభ్యర్థులు నామినేషన్స్‌ కూడా వేసేస్తు న్నారు. కాంగ్రెస్‌, బీజేపీ పోటాపోటీ గా ప్రచారాలు చేస్తున్నాయి. ఒపీనియన్‌ పోల్స్‌ అన్నీ రెం డు పార్టీల మధ్య గట్టి పోటీ ఉంటుం దని చెబుతున్నాయి. దీంతో బీజేపీ ప్రచారాల కోసం ఒక కొత్త పద్ధతిని ఎంచుకుం ది. అదే మ్యాజిక్‌.ఇందుకోసం ప్రత్యేకంగా కొం తమంది మెజీషియన్లను నియమిం చుకొని జనాలు తిరిగే మార్కెట్‌
ప్లేస్‌లలో మ్యాజిక్‌ షోలు చేస్తారట. గత పదిహేను సంవత్సరాలుగా బీజేపీ రాష్ట్రానికి ఏమేం చేసిందో చెబుతూ ఈ మ్యాజిక్‌ షోలు పెడతారట. ఎంతమంది మెజీషియన్లను తీసుకుం టారన్నది ఇంకా నిర్ణయిం చుకోలేదు కానీ , దీనికోసమే కొం త బడ్జెట్‌ను కూడా పెట్టుకున్నారట. బీజేపీ ఈ కొత్త ప్రచారానికి కామెంట్ స్‌ కూడా ‘ప్రచారమే మ్యాజిక్‌. మళ్లీ మ్యాజిక్‌ షోనా?’ అని వినిపిస్తున్నాయి.