సాక్షి లేనప్పుడు.. నేరానికి గల కారణమే కీలకం

సాక్షి లేనప్పుడు.. నేరానికి గల కారణమే కీలకం

ఓ హత్య కేసులో సుప్రీంకోర్టు


న్యూఢిల్లీ: ఏదైనా ఒక నేరం జరిగినప్పుడు ప్రత్యక్ష సాక్షులు లేనప్పుడు, నిందితుడు ఆ నేరం చేయడానికి గల కారణాలను రుజువు చేయాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు తెలిపింది. ఓ హత్య కేసులో దోషిగా తేలిన వ్యక్తిని నిర్దోషిగా ప్రకటిస్తూ కోర్టు ఈ కామెంట్లు చేసింది. చత్తీస్​గఢ్​లో 2008లో ఓ  వ్యక్తి హత్యకు గురయ్యాడు. అదే సమయంలో అతని ఇంటికి వచ్చిన మేనమామ.. ఘటనా స్థలం నుంచి ఓ వ్యక్తి పారిపోవడాన్ని చూశాడు. అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితుడు పారిపోవడాన్ని చూశానని, హత్యకు ఉపయోగించిన ఆయుధం అక్కడ పడి ఉందని పేర్కొన్నాడు. దీంతో చత్తీస్‌‌‌‌గఢ్ హైకోర్టు పారిపోయిన వ్యక్తినే దోషిగా నిర్ధారించి, జీవితఖైదు విధింది. ఈ తీర్పును సదరు వ్యక్తి సుప్రీంకోర్టులో సవాల్​ చేశాడు. దీంతో ‘ఆ వ్యక్తే హత్య చేశాడనడానికి ఆధారం లేదు. మద్యం మత్తులో పదునైన వస్తువుపై పడి మృతిచెంది ఉండవచ్చన్న డిఫెన్స్ వెర్షన్ ఆధారంగా నిందితుడిని నిర్దోషిగా ప్రకటిస్తున్నామని బెంచ్​ తీర్పు చెప్పింది.