థియేటర్లు, ఆఫీసుల్లో మళ్లీ సగం మందికే పర్మిషన్​

థియేటర్లు, ఆఫీసుల్లో మళ్లీ సగం మందికే  పర్మిషన్​
  • మహారాష్ట్రలో కొత్త రూల్స్​
  • రిలీజియస్, పొలిటికల్, సోషల్ గ్యాదరింగ్స్ వద్దు.. 
  • ఈ నెల 31 దాకా రిస్ట్రిక్షన్స్
  • పంజాబ్​లో స్కూళ్లు బంద్, 11 జిల్లాల్లో ఆంక్షలు
  • దేశంలో 24 గంటల్లో 39,726 కొత్త కేసులు
  • న్యూఢిల్లీ/ముంబై: కరోనా కేసులు భారీగా నమోదవుతున్న నేపథ్యంలో మహారాష్ట్ర సర్కారు మరిన్ని ఆంక్షలు విధించింది. శుక్రవారం కొత్త గైడ్​లైన్స్ జారీ చేసింది. ఆడిటోరియాలు, థియేటర్లు, ప్రైవేటు ఆఫీసులు 50 శాతం ఆక్యుపెన్సీ కెపాసిటీతోనే ఆపరేట్ కావాలని ఆదేశించింది. థియేటర్లు, ఆడిటోరియాలను రిలీజియస్, సోషల్, పొలిటికల్, కల్చరల్ గ్యాదరింగ్స్ కోసం ఉపయోగించరాదని స్పష్టం చేసింది. ఈ రిస్ట్రిక్షన్స్ ఈనెల 31 దాకా అమల్లో ఉంటాయని చెప్పింది. ఈ రూల్స్ ఉల్లంఘించిన థియేటర్లు, ఆడిటోరియాలను కరోనా ఎండ్ అయ్యే దాకా మూసేస్తామని, డిజాస్టర్ చట్టం ప్రకారం పెనాల్టీలు విధిస్తామని హెచ్చరించింది. ఇక హెల్త్, ఇతర ఎస్సెన్షియల్ సర్వీసులు తప్ప.. మిగతా ప్రైవేటు ఆఫీసులన్నీ 50 శాతం కెపాసిటీతోనే కొనసాగించాలని స్పష్టం చేసింది. ప్రభుత్వ ఆఫీసుల్లో స్టాఫ్ అటెండెన్స్​ఫై సంబంధిత హెచ్ఓడీలు నిర్ణయం తీసుకోవాలని సూచించింది. ఫుల్ కెపాసిటీతో మాన్యుఫాక్చరింగ్ సెక్టార్ కార్యకలాపాలు సాగించవచ్చని చెప్పింది.
  • పంజాబ్​లోనూ ఆంక్షలు
  • శనివారం నుంచి పంజాబ్ అంతటా మరిన్ని ఆంక్షలు అమల్లోకి వస్తాయని ఆ రాష్ట్ర సీఎం అమరీందర్ సింగ్ చెప్పారు. మెడికల్, నర్సింగ్ కాలేజీలు తప్ప.. మిగతా అన్ని ఎడ్యుకేషన్ ఇన్​స్టిట్యూషన్లను ఈనెల 31 దాకా మూసేస్తున్నట్లు ప్రకటించారు. సినిమా హాళ్లు 50 శాతం కెపాసిటీతో నడుపుకోవాలని సూచించారు. మాల్స్​లో ఒకే టైంలో 100 మంది కంటే ఎక్కువ మంది ఉండకూడదని ఆదేశించారు. ప్రజలు వచ్చే 2 వారాలు ఇండ్లకే పరిమితం కావాలని, కరోనా ట్రాన్స్​మిషన్ చైన్​ను బ్రేక్ చేద్దామని పిలుపునిచ్చారు. పంజాబ్​లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న 11 జిల్లాల్లో సోషల్ గ్యాదరింగ్స్​పై బ్యాన్ విధించారు. పెళ్లిళ్లు, అంత్యక్రియలకు కేవలం 20 మందికి మాత్రమే పర్మిషన్ ఉంటుంది. ఈ 11 జిల్లాల్లో రాత్రి 9 నుంచి తెల్లవారుజామున 5 దాకా కర్ఫ్యూ ఉంటుంది. ఆదివారాల్లో సినిమా హాళ్లు, రెస్టారెంట్లు, మాల్స్ క్లోజ్ చేయాలని అమరీందర్ సింగ్ ఆదేశించారు. రెస్టారెంట్లకు హోం డెలివరీలకు పర్మిషన్ ఇచ్చారు. ప్రతి శనివారం ఉదయం 11 నుంచి 12 దాకా గంటపాటు రాష్ట్రమంతటా నిశ్శబ్దం పాటించాలని సూచించారు. కరోనా మృతులకు సంతాపంగా చేపట్టే ఈ కార్యక్రమం సమయంలో ఒక్క వాహనం కూడా కదలకూడదన్నారు.
  • భోపాల్, ఇండోర్, జబల్పూర్​లో లాక్ డౌన్
  • మహారాష్ట్రలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో ఆ రాష్ట్రానికి పొరుగున ఉన్న మధ్యప్రదేశ్​లోని భోపాల్, ఇండోర్, జబల్పూర్​లలో 3 రోజుల పాటు లాక్​డౌన్ ప్రకటించారు. ఈ సిటీల్లో ఆదివారం వరకూ లాక్ డౌన్ ఉంటుందని, ఈ నెల 31 దాకా స్కూళ్లు, కాలేజీల బంద్ కొనసాగుతుందని మధ్యప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది. మహారాష్ట్ర నుంచి బస్ సర్వీసులను కూడా రద్దు చేస్తున్నట్లు గురువారం సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. రాష్ట్రంలో పలుచోట్ల నైట్ కర్ఫ్యూ విధిస్తున్నట్లు తెలిపారు.
  • దేశంలో ఒక్కరోజే 39,726 కేసులు
  • గురువారం నుంచి శుక్రవారం దాకా 24 గంటలలో 39,726 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇందులో ఒక్క మహారాష్ట్రలోనే 25,833 మంది వైరస్ బారిన పడ్డారు. యాక్టివ్ కేసుల సంఖ్య 2,71,282గా ఉంది. దేశంలో 8 రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నాయి. ఇక 16 రాష్ట్రాలు, యూటీల్లో గత 24 గంటల్లో ఒక డెత్ కూడా లేదు. దేశవ్యాప్తంగా 3,93,39,817 వ్యాక్సిన్ డోసుల పంపిణీ పూర్తయింది.