కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థినీలను కొరికిన ఎలుకలు

కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థినీలను కొరికిన ఎలుకలు

వరంగల్ ఎంజీఎంలో ఎలుకల ఘటన మరవక ముందే కాకతీయ యూనివర్సిటీలోనూ మూషికాల సంచారం కలవరపెడుతోంది. గర్ల్స్ హాస్టళ్లలో పెద్ద సంఖ్యలో ఎలుకలు సంచరిస్తున్నా.. సంబంధిత అధికారులెవరూ పట్టించుకోవడం లేదు. దీంతో హాస్టళ్లలో నిద్రిస్తున్న విద్యార్థుల కాళ్లు, చేతులు కొరకడంతో గాయాలయ్యాయి. కాకతీయ క్యాంపస్ లోని గర్ల్స్ హాస్టల్లో ఈ ఘటన కలకలం రేపుతోంది.

ఎలుకలు కొరకడంతో గాయాలపాలైన విద్యార్థినులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్యాంపస్ లోని పద్మాక్షి హాస్టల్ 'డీ' బ్లాక్ రూం నెంబరు-1లో ఇద్దరు విద్యార్థినులకు గాయాలయ్యాయి. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. చికిత్స కోసం బాధిత విద్యార్థినులు హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లారు.  ఘటన జరిగిన గదిలో పారిశుధ్యం లోపించిందని. పనికిరాని వస్తువులన్నీ నిల్వ ఉంచారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హాస్టళ్లలో ఎలుకలు పెద్ద సంఖ్యలో తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.