శ్రుతి హాసన్​ ఏమైనట్టు?

 శ్రుతి హాసన్​ ఏమైనట్టు?

టాలీవుడ్​ బడా ప్రాజెక్ట్​, ప్యాన్​ ఇండియా రేంజ్​ సినిమా ‘సలార్’​. ప్రశాంత్​ నీల్​తో ప్రభాస్​ కాంబినేషన్​ ఎలా ఉంటుందోనని ఫ్యాన్స్​ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఏమాత్రం చిన్న అప్​డేట్​ వచ్చినా సోషల్​ మీడియాలో ఫ్యాన్స్​ రచ్చ చేస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్​గా నటిస్తోన్న శ్రుతి హాసన్​లో మాత్రం ఈ జోష్ మిస్సైంది. 

తాజాగా క్రాక్​, వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి వంటి బ్యాక్​ టు బ్యాక్​ హిట్లు పడినా ఈ బ్యూటీ నుంచి ఒక్క అప్​డేట్​ కూడా లేదు. తన తర్వాతి సినిమాలపై ఎలాంటి క్లారిటీ లేదు. కావలసినంత క్రేజ్​ ఉండి మల్టీట్యాలెంటెడ్​గా పేరు తెచ్చుకున్న ఈ స్టార్​ కిడ్​ సినిమాల ఎంపికలో ఇంత జాప్యం చేయడంపై ఆమె అభిమానులు తెగ ఫీలైపోతున్నారట.