నర్సంపేట, వెలుగు: వరంగల్ జిల్లా నర్సంపేటలో కొత్తగా మంజూరైన మెడికల్ కాలేజ్‌ను ఈనెల 17న ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి వెల్లడించారు. శనివారం వరంగల్ కలెక్టర్ సత్యశారదతో కలిసి మెడికల్ కాలేజ్ బిల్డింగ్, జిల్లా ఆస్పత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మెడికల్ కాలేజ్‌ను రాష్ర్ట వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితోపాటు జిల్లా మంత్రులు కొండా సురేఖ, సీతక్క ప్రారంభించనున్నట్లు తెలిపారు. కొత్త కాలేజ్‌లో ఈ ఏడాది 50 అడ్మిషన్లతో తరగతులు కొనసాగుతాయన్నారు. అనంతరం ఆస్పత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి కాంటిన్ను వారు పరిశీలించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్డాక్టర్ మోహన్‌దాస్, ఆర్డీవో కృష్ణవేణి, డీసీపీ రవీందర్, డీఎంహెచ్‌వో వెంకటరమణ తదితరులు
పాల్గొన్నారు.