బర్త్​ డే రోజే అంత్యక్రియలు

బర్త్​ డే రోజే అంత్యక్రియలు

ఆసిఫాబాద్, వెలుగు: కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో తెల్లారితే బర్త్ డే ఉందనగా ఓ టీనేజర్ కన్నుమూశాడు. దీంతో అతడి కుటుంబసభ్యులు కడసారిగా అతడి శవంతో కేక్​ కట్​ చేయించి వీడ్కోలు పలికారు. ఆసిఫాబాద్ మండలంలోని బాబాపూర్ కు చెందిన గుణవంతరావు, లలిత దంపతుల మూడో కొడుకు సీహెచ్ సచిన్ (16) ఇటీవల ఎస్సెస్సీ పూర్తి చేశాడు.

శుక్రవారం బర్త్ డే ఉండడంతో గురువారం షాపింగ్ కు వెళ్లారు. మధ్యాహ్నం సచిన్ కు ఛాతిలో  నొప్పి రావడంతో లోకల్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. డాక్టర్ గుండెపోటు వచ్చిందని చెప్పడంతో మెరుగైన వైద్యం కోసం మంచిర్యాలకు తరలించారు. అక్కడే ట్రీట్ మెంట్ తీసుకుంటూ చనిపోయాడు. దీంతో మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చి అర్ధరాత్రి కేక్ కట్ చేయించారు. బర్త్​ డే రోజే అంత్యక్రియలు చేశారు.