నడిరోడ్డుపై జుట్లు పట్టుకొని కొట్టుకున్న మహిళలు

నడిరోడ్డుపై జుట్లు పట్టుకొని కొట్టుకున్న మహిళలు

ఖమ్మం: ఇద్దరు మహిళలు నడిరోడ్డుపై బీభత్సంగా కొట్టుకున్నారు. ప్రధాన రహదారిపై అందరూ చూస్తుండగా పిడిగుద్దులతో ఒకరిపై ఒకరు విరుచుకుపడ్డారు. జుట్లు పట్టుకొని ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.

భర్తతో అక్రమ సంబంధం పెట్టుకుందని రోడ్డు వెంట వెళ్తున్న మహిళపై మరో మహిళ దాడి చేసిన సంఘటన  ఖమ్మం పట్టణంలోని వేంసూర్ రోడ్డులో జరిగింది. ఇదంతా చూసిన స్థానికులు, వాహనదారులు వారిని విడిపించారు.