Income Tax: పన్ను చెల్లింపుదారులకు ఊరట.. ఐటీఆర్ గడువు సెప్టెంబర్ 15కి పెంపు..

Income Tax: పన్ను చెల్లింపుదారులకు ఊరట.. ఐటీఆర్ గడువు సెప్టెంబర్ 15కి పెంపు..

ITR Filing: వాస్తవానికి ప్రతి సంవత్సరం ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు తమ ఐటీఆర్ ఫైల్ చేసేందుకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ జూలై 31 చివరి గడువుగా ప్రకటిస్తుంటుంది. అలాగే ఇందులో ఏదైనా కారణాల వల్ల మార్పులు జరిగితే దానిపై ప్రకటన చేస్తుంటుంది. వాస్తవానికి ఈ సంవత్సరం కూడా టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేవారు జూలై 31, 2025 నాటికి వాటిని పూర్తి చేయాల్సి ఉంది. 

అయితే తాజాగా జూలైగా ఉన్న పన్ను రిటర్న్ ఫైలింగ్ చివరి గడువును సెప్టెంబర్ 15, 2025 వరకు పొడిగిస్తున్నట్లు పన్ను శాఖ ప్రకటించింది. దీనిపై తాజాగా సర్కులర్ కూడా విడుదల చేసింది. వాస్తవానికి కొత్త ఐటీఆర్ ఫారంల విడుదలలో జరిగిన జాప్యం, ఫైలింగ్ కోసం అవసరమైన టూల్స్ లేటు కారణంగా గడుపు పొడిగింపు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఇప్పటికే ఫారంలు ఈ ఏడాదిలో అనేక మార్పులకు లోనయ్యాయి. అందువల్ల టాక్స్ డిపార్ట్మెంట్ వీటిని ప్రజలు తమ రిటర్న్స్ ఫైల్ చేసుకునేందుకు వాడుకునేందుకు అందుబాటులోకి తీసుకురావటానికి మరింత సమయం పడుతోందని వెల్లడించింది. 

 

వాస్తవానికి టాక్స్ డిపార్ట్మెంట్ ఫైనల్ ఐటీఆర్ ఫారంలు, వాటిని ఫిల్ చేసేందుకు ఆన్ లైన్ యుటిలిటీస్ సిద్ధం చేయకపోతే ప్రజలు తమ ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు కుదరదు. ప్రస్తుతం వీటి ప్రక్రియలో ఆలస్యం వల్ల గడువు పొడిగించాల్సిన అవసరం వచ్చిందని అధికారులు చెబుతున్నారు. ఫారంలు అందుబాటులోకి రాగానే దీనిపై ప్రకటన చేస్తామని, అప్పటి నుంచి ప్రజలు తమ ఫైలింగ్ ప్రక్రియను ప్రారంభించవచ్చని ట్విట్టర్ ఖాతా పోస్టులో స్పష్టం చేసింది. 

►ALSO READ | మోతీలాల్ ఓస్వాల్ సూచించిన లిక్కర్ స్టాక్.. కొన్నోళ్లకు లాభాల కిక్కే..!