
Stock To Buy: గడచిన కొన్ని వారాలుగా దేశీయ స్టాక్ మార్కెట్లతో పాటు అంతర్జాతీయంగా మార్కెట్లు ప్రతికూలంగా ఉండటంతో ఇన్వెస్టర్లు కొంత ఆందోళన చెందుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొందరు ఐపీవోలపై బెట్టింగ్ వేయాలని అనుకుంటుండగా మరికొందరు బ్రోకరేజీల సజిషన్స్ ఫాలో అవుతూ దీర్ఘకాలిక, స్వల్పకాలిక పెట్టుబడులపై దృష్టి సారిస్తున్నారు. ప్రస్తుత కాలంలో డిఫెన్స్ రంగానికి చెందిన షేర్లు ఇన్వెస్టర్లపై లాభాలు కుమ్మరిస్తున్న సంగతి తెలిసిందే.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది రాడికో ఖైతాన్ లిమిటెడ్ కంపెనీ షేర్ల గురించే. వాస్తవానికి 8పీఎం బ్రాండ్ మద్యాన్ని తయారు చేసి విక్రయించేది ఈ కంపెనీనే. నేడు మార్కెట్లు పతనంలో కొనసాగినప్పటికీ కంపెనీ షేర్లు పెరుగుదలను చూశాయి. వాస్తవానికి దేశీయ బ్రోకరేజ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ స్టాక్ పై తన సానుకూల అభిప్రాయాన్ని వెల్లడించటం కూడా దీనికి కలిసొచ్చింది.
నేడు మార్కెట్లు క్లోజయ్యే సమయానికి రాడికో ఖైతాన్ కంపెనీ షేర్ల ధర ఒక్కోటి రూ.2వేల 438.20 వద్ద ఉంది. వాస్తవానికి ఇది నేడు ఇంట్రాడేలో కనిష్ఠ ధర. రానున్న కాలంలో కంపెనీ షేర్లు 20 శాతం మేర పెరిగి ఒక్కోటి రూ.3వేలకు చేరుకుంటాయని బ్రోకరేజ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ తన అంచనాలను పంచుకుంది. అలాగే కంపెనీ షేర్లకు కొనుగోలు రేటింగ్ అందించింది. గడచిన మూడు నెలల కాలంలో కంపెనీ షేర్లు దాదాపు 17 శాతం వృద్ధిని నమోదు చేశాయి. అలాగే ఏడాది కాలంలో 50 శాతం మేర రాబడిని అందించింది. 10 ఏళ్ల సుదీర్ఘకాలంలో ఇన్వెస్టర్లు 2వేల 710 శాతం రాబడిని అందుకున్నారు.
►ALSO READ | Realme GT 7, GT 7T, డ్రీమ్ ఎడిషన్ లాంచ్..ఫీచర్లు, ధర, అమ్మకం వివరాలివిగో
రాడికో ఖైతాన్ పాత పేరు రాంపూర్ డిస్టిలరీస్. కంపెనీ తన కార్యకలాపాలను స్వాతంత్ర్యం రాకముందు 1943లోనే ప్రారంభించింది. మెుదట్లో పెద్ద మెుత్తంలో స్పిరిట్ సరఫరా చేసిన ఈ కంపెనీ ప్రస్తుతం PM, మ్యాజిక్ మూమెంట్స్, రాయల్ రణతంబోర్, రాంపూర్ సింగిల్ మాల్ట్, ఆఫ్టర్ డార్క్, జైసల్మేర్ వంటి ప్రఖ్యాత బ్రాండ్ల విక్రయాలతో మంచి గుర్తింపును అందుకుంది.
NOTE: పైన అందించిన వివరాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటి ఆధారంగా ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు తీసుకోకండి. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోల్లో పెట్టుబడులు నష్టాలతో కూడుకున్నవి. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకోవటానికి ముందుగా మీ ఆర్థిక సలహాదారులను సంప్రదించటం ఉత్తమం. మీరు తీసుకునే నిర్ణయాలకు V6 యాజమాన్యం లేదా ఉద్యోగులు ఎట్టిపరిస్థితుల్లోనూ బాధ్యత వహించరు.