శరద్‌ పవార్‌కు ఐటీ నోటీసులు

శరద్‌ పవార్‌కు ఐటీ నోటీసులు

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) అధినేత శరద్ పవార్ కు ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది.  మహారాష్ట్ర సీఎంగా ఏక్‌నాథ్‌ షిండే బాధ్యతలు చేపట్టి 24 గంటలు కాకముందే  పవార్ కు ఐటీ నుంచి నోటీసులు రావడం గమనార్హం.  తనకు  ఐటీ నోటీసులు జారీ చేసిన విషయాన్ని పవార్ తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఈ నోటీసులను  ప్రేమ లేఖగా పేర్కొంటూ కేంద్రం పైన విమర్శలు చేశారు  పవార్.  ‘‘నాకో ప్రేమ లేఖ అందింది. 2004, 2009, 2014, 2020 ఎన్నికల సమయంలో నేను సమర్పించిన అఫిడవిట్లకు సంబంధించి ఆదాయపు పన్ను విభాగం నుంచి ఈ ప్రేమ లేఖ వచ్చింది’’  అని ట్వీట్ చేశారు పవార్. అయితే ఈ నోటీసుుల గురించి తాను ఆందోళన చేందడం లేదని, దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తన వద్ద ఉన్నట్టుగా పవార్ తెలిపారు. శరద్ పవార్ కు ఐటీ శాఖ నోటీసులు జారీ చేయడం పట్ల ఎన్‌సీపీ నేతలు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.  అటు శివసేన నేత సంజయ్ రౌత్ కు ఇప్పటికే ఈడీ సమన్లు జారీ చేయగా, ఆయన ఈ రోజు దర్యాప్తు సంస్థ ముందు హాజరుకానున్నారు.